ఎండాకాలంలో చెరుకు రసం తాగే ముందు ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి
ఎండాకాలంలో చెరుకు రసం తాగే ముందు ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి
ఎండాకాలంలో చెరుకు రసం తాగే ముందు ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి
లహరి, ఫిబ్రవరి 28, ఆరోగ్యం : వేసవి ఎండల తీవ్రతకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు శీతల పానీయాల వైపు చూస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకెళ్లే వారికి ఈ ఎండలతో తిప్పలు తప్పడం లేదు. దీంతో వీరంతా ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి చెరుకు రసం తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనానికి ద్రవ పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు లభ్యమయ్యే వాటిల్లో చెరుకు రసం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. కావాల్సిన పోషకాలను అందిస్తుంది.ఎండాకాలంలో రోడ్డు మీద వెళ్తుంటే చెరుకు రసం బండ్లు దర్శనమిస్తుంటాయి. తక్కువ ధరకే దొరికే చెరుకు రసాన్ని తాగేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. వేసవిలో ఎక్కడ చూసినా జ్యూస్ సెంటర్లు, చెరుకు రసాల బండ్లు కనిపిస్తుంటాయి. చెరుకు రసం తాగడంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిఫుణులు చెబుతున్నారు. మండే ఎండల నుంచి ఉపశమనానికి, దాహార్తిని తీర్చడామే కాకుండా ఆరోగ్యానికి చెరుకు రసం ఎంతగానో ఉపయోడపడుతుంది. చెరుకు రసంలో ఉండే గ్లూకోజ్‌ను శరీరం చాలావేగంగా తీసుకుని వెంటనే ఉపయోగించుకుంటుంది. చెరుకు రసం తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. చెరుకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది. కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరుకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్చిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరుకు రసం దోహదపడుతుంది. చెరుకు రసంలో రోగ నిరోధకశక్తిని పెంచే విటమిన్ సీ, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. అల్కలైన్ స్వభావం కలిగిన చెరుకు రసం ప్రొస్టేట్, కొలన్, ఉపరితిత్తులు, రొమ్ము క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. అన్నింటికీ మించి వేసవిలో చెరుకు రసం తాగడంతో శరీరంలో వేడిని తగ్గించి చల్ల బరుస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
Also Read : ఈ ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే, కళ్లద్దాల అవసరం రాదు…
ఐస్‌తో కాస్త జాగ్రత్త…
అల్లం, నిమ్మరసం కలిపి తీసుకుంటే రుచి బాగుండడంతో పాటు పోషకాలు మరో రూపంలోకి మారకుండా నిరోధిస్తాయి. దీంతో సహజసిద్ధ పోషకాలు శరీరంలోకి చేరిపోతాయి. ఇక అల్లం వగరు రుచిని ఇవ్వడంతో పాటు నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఐస్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఐస్ తయారీలో ఎక్కువగా నీటిని శుద్ధి చేయకుండానే వాడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. తద్వారా రోగాల బారినపడే అవకాశం లేకపోలేదు. అందుకే ఐస్ లేకుండా చెరుకు రసం తాగడమే ఉత్తమం. చల్లదనం కోసం ఐస్‌గడ్డలు లేకుండానే చెరుకు రసాన్ని తీసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం చెరుకు తోటల సాగుకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో చెరుకు రసంతో పాటు నాణ్యమైన బెల్లం లభిస్తాయి. ప్రస్తుతం వేసవి కావడంతో చెరుకు రసం బండ్లు భారీగా వెలిశాయి. నిర్వాహకులు రోడ్ల వెంట గానుగ ఆడించి స్వచ్ఛమైన చెరుకు రసం అమ్ముతున్నారు. ఇటీవల న్యాల్‌కల్ మండలంలో పర్యటించిన ఫిజీ దేశ చెరుకు అభివృద్ధి శాఖ మంత్రి చరణ్‌జీత్ సింగ్ స్వయంగా చెరుకు రసం బండి వద్దకు వెళ్లి తాగారు.