అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకోవాలి..

నిరసనకారులపై పోలీసుల కాల్పులు ఖండిస్తున్నాం

1
TMedia (Telugu News) :

అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకోవాలి..

-నిరసనకారులపై పోలీసుల కాల్పులు ఖండిస్తున్నాం

-ఎస్.ఎఫ్.ఐ & డి.వై.ఎఫ్.ఐ
టీ మీడియా, జూన్21, ఖమ్మం :- భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ) ఖమ్మం జిల్లా కమిటీలు ఆధ్వర్యంలో శనివారం అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని, సికింద్రాబాద్ లో ఆందోళన చేస్తున్న వారి పై కాల్పులను విరమించాలనీ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ర్యాలీగా వెళుతున్న ఎస్.ఎఫ్.ఐ & డీ.వై.ఎఫ్.ఐ నాయకులను స్థానిక నిర్మల హృదయ స్కూల్ ముందు అటకాయించి బలవంతంగా పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు… ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శులు వడ్రాణపు మధు & షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ :- మిలిటరీ ఉద్యోగాలకు 21 నుండి 23 వయస్సు 2 సంవత్సరాలు సడలింపిస్తూ ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలను 4 సంవత్సరాల కాలం పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే నిర్ణయం సరైనది కాదన్నారు.. గత 2 సంవత్సరాలుగా సైనిక ఉద్యోగాల నియామకం చేపట్టకుండా ఒక్కసారిగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకై అగ్నిపథ్ తీసుకురావడం పనికిమాలిన చర్య అనీ, ఈ నిర్ణయంతో లక్షలాది మంది సైనిక అభ్యర్థులు నష్టపోతారన్నారు.

Also Read : దళిత రత్న అవార్డ్ గ్రహీత పప్పుల వేణుగోపాల్

నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరిపారనీ,ఇద్దరు నిరసనకారులు చనిపోయారనీ, పదుల సంఖ్యలో గాయపడ్డారనీ అన్నారు. దీనిని దేశ ప్రజాస్వామిక వాదులు ఖండించాలన్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు పెట్టి,ఫలితాలు విడుదల చేయని నోటిఫికేషన్లు రద్దు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో డీ.వై.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు సత్తెనపల్లి నరేష్, గుమ్మా ముత్తా రావు, మంగపతి, జిల్లా సహాయ కార్యదర్శులు కూరపాటి శ్రీను, చింతల రమేష్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు తుడుం ప్రవీణ్ ఖమ్మం టౌన్ కన్వీనర్ తరుణ్, సాయికుమార్, యశ్వంత్, గణేష్ , నితిన్, విజయ్, అజయ్, డీవైఎఫ్ఐ నాయకులు కోంగర నవీన్, కారుమంచి పవన్, గడ్డం విజయ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube