రెడ్డి గార్డెన్ వైపు రోడ్డు వేయించండి

డిప్యూటీ సీఎం భట్టికి విజ్ఞప్తి

0
TMedia (Telugu News) :

రెడ్డి గార్డెన్ వైపు రోడ్డు వేయించండి

-డిప్యూటీ సీఎం భట్టికి విజ్ఞప్తి

టీ మీడియా, జనవరి 5,మధిర : పట్టణంలోని రెడ్డి గార్డెన్ వైపుకు వెళ్లి రోడ్డు వేయాలని ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కుకి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, మధిర ఎమ్మెల్యేగా మల్లు భట్టి విక్రమార్క ఎన్నికలో భారీ ఆధిక్యంతో గెలుపొందారని,పట్టణ సమస్యలు పరిష్కరిస్తారని ఈ ప్రాంత ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారని చెప్పారు.ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటి వరకు సీసీ రోడ్డు వేయకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారని తెలిపారు.

Also Read : ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున ఉద్యమిస్తాం

అత్యవసర సమయంలో రోగులను ఆసుపత్రికి తరలించాలంటే బాధలు వర్ణణాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు.పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వినతులిచ్చినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.శనివారం రెడ్డి గార్డెన్ లో నిర్వహిస్తున్న పౌర సన్మానికి విచ్చేయుచున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒకసారి తొమ్మిదో వార్డు రెడ్డి గార్డెన్ ఏరియాలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube