అల్లం అధికంగా తీసుకుంటే.?
లహరి, ఫిబ్రవరి 2, ఆరోగ్యం : అల్లం మోతాదుకి మించి తీసుకుంటే గుండెల్లో మంట రావచ్చు. అల్లం ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అల్లం అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.గర్భిణీలు అల్లం మోతాదుకి మించి తీసుకుంటే సమస్యలు తలెత్తే అవకాశం వుంది.అల్లం ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం కలుగుతాయి. రక్తంలో చక్కెర శాతాన్ని బాగా తగ్గించే గుణం అల్లంకి వుంది, కనుక అధిక మోతాదులో తీసుకోరాదు. అల్లం అధికంగా తీసుకున్నవారిలో కొందరికి చర్మం, కళ్లకు సంబంధించిన సమస్యలు రావచ్చు.