జాతీయస్థాయి కరాటే పోటీలలో ప్రతిభ
టీ మీడియా, ఫిబ్రవరి 27, వనపర్తి బ్యూరో : జడ్చర్ల మున్సిపాలిటీలోని, సత్యనారాయణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 4వ జాతీయ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ 2023 పోటీలు ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు చెందిన విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలకు కొత్తకోటకి చెందిన గాడ్స్ ఆన్ వారియర్స్, షోటోకాల్ కరాటే ఇండియా కి చెందిన విద్యార్థులు పాల్గొని అద్భుతమైన ప్రతిభ చూపి ప్రత్యర్థులను చెమటలు పట్టించి బంగారు వెండి పథకాలు సాధించాలని క్లబ్ ఫౌండర్ అబ్దుల్ నబీ తెలిపారు. వీరిలో బాలికల అండర్ 07,కాటాస్ విభాగంలో రష్మిక, బంగారు పథకాలు, మేఘన వెండి సాబ్ పతకం సాధించారు. 15 సంవత్సరాల విభాగంలో కాటాస్ మేఘన, రాజేశ్వరి,బంగారు పతకం సాధించారు. అబ్బాయిల కాతాస్ విభాగంలో 09 సంవత్సరాల కాటాస్ విభాగంలో అనిల్, అన్వేష్, యశ్వంత్, గోల్డ్ మెడల్, 14 సంవత్సరాల విభాగంలో, సాయి చరణ్ తేజ్,బంగారు పతకం, ఎండి రహీం, సాత్విక్, వెండి పతకం సాధించారు.అదేవిధంగా కుమ్మితే బాలుర విభాగంలో అండర్.06, సంవత్సరాల విభాగంలో వెంకట్రావు బంగారు పతకం,అండర్,,10, సంవత్సరాల విభాగంలో, రిత్విక్ గౌడ్,గౌతం, బంగారు పతకం,రాఘవ, ఎం ప్రవీణ్, ఎస్ సృజన్,డి శివ దితుత్య, వెండి పతకం సాధించారు.
Also Read : గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో
విద్యార్థి విద్యార్థినులకు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, డాక్టర్ లక్ష్మారెడ్డి, పాటు మహబూబ్నగర్ జిల్లామాస్టర్ అందరూ కూడా విద్యార్థులను అభినందించడం జరిగింది అని క్లబ్బు ఫౌండర్ అబ్దుల్ నబీ తెలిపారు. విద్యార్థులను క్లబ్బు సీనియర్ కరాటే మాస్టర్, జాఫర్ సాదిక్,జి హరీష్ యాదవ్ ఇంతియాజ్ సుమా జహంగీర్ మంజునాథ్, కురుమూర్తి శివరాజ్, అంజి, విద్యార్థులను అభినందించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube