ప్రతిభగల విద్యార్థికి సన్మానం

ప్రతిభగల విద్యార్థికి సన్మానం

1
TMedia (Telugu News) :

ప్రతిభగల విద్యార్థికి సన్మానం

టీ మీడియా, ఏప్రిల్ 14, వనపర్తి,బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని రాయిగడ్డకు చెందిన రఘునాయుడు మొదటి కుమార్తె భవాని జాతీయ స్థాయిలో టెన్నీస్ వాలీబాల్ ద్వితీయ స్థానం గెలుపొందిన సందర్భంగా తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ భాషా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఆటల్లో పాటల్లో చదువుల్లో బాగా రాణించిన అప్పుడే విద్యార్థులకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని వనపర్తి పట్టణానికి చెందిన భవాని జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం గెలుపొందడం గర్వకారణమన్నారు. భవాని వరంగల్ జిల్లా టీఎస్సార్జెసి కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నది.

Also Read;పాఠశాల లో గంజాయి పోలీసుల సహకారంతో ఉపాధ్యాయులు నిఘా

ఆటల్లో చురుకైన విద్యార్థిని కావడంతో మార్చిలో హనుమకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి టెన్నీస్ వాలీబాల్లో జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈనెల నాలుగో తేదీన మహారాష్ట్ర నాందేడ్లో జరిగిన జాతీయ స్థాయి టెన్నీస్ వాలీబాల్ ద్వితీయ స్థానం సంతోషకరమని మరింత రాణించాలని అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో రాణించాలనే సందర్భంగా విద్యార్థిని ఖాదర్ భాష దీవించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కన్వీనర్ వాగ్గేయకారులు రాజా రామ్ ప్రకాష్, రాజేష్ కుమార్ శెట్టి, శాంతి నాయక్, వినోద్, లింగస్వామి, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Also Read;.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube