కాశీలో త‌మిళ సంగ‌మం ఉత్స‌వాలు

కాశీలో త‌మిళ సంగ‌మం ఉత్స‌వాలు

1
TMedia (Telugu News) :

కాశీలో త‌మిళ సంగ‌మం ఉత్స‌వాలు

టీ మీడియా,నవంబర్ 19,వార‌ణాసి : కాశీలో నేటి నుంచి కాశీ-త‌మిళ సంగ‌మం ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. త‌మిళ‌నాడుకు చెందిన ద్ర‌విడ సంస్కృతి గురించి యూపీలో ప్ర‌ద‌ర్శ‌న చేయ‌నున్నారు. త‌మిళ‌ వంట‌కాలు అక్క‌డ గుమ‌గుమ‌లాడ‌నున్నాయి. త‌మిళ సంగీతం కూడా కాశీలో మారుమోగ‌నున్న‌ది. కాశీ త‌మిళ సంగ‌మం కోసం రామేశ్వ‌రం నుంచి ప్ర‌త్యేక రైలులో 216 మంది ఇవాళ వార‌ణాసి చేరుకున్నారు. ఆ బృందానికి కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ స్వాగ‌తం ప‌లికారు. రామేశ్వ‌రం, కాశీ మ‌ధ్య విడ‌దీయ‌రాని బంధం ఉంద‌ని, రెండు ప్రాంతాల ప్ర‌జ‌లు త‌మ మ‌ధ్య సంస్కృతి, జ్ఞానాన్ని పంచుకోవ‌చ్చు అని, ఇక్క‌డ ఉన్న పురాత‌న సంస్కృతిని నేర్చుకునేందుకు వ‌చ్చిన‌ట్లు ఓ వ్యక్తి తెలిపారు.

Also Read : పైనంనంపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పాత బకాయిలు వసూలు చేస్తున్న సబ్ ఇంజనీర్

కాశీలో 30 రోజుల పాటు ద్ర‌విడ సంస్కృతి, సంప్ర‌దాయాల గురించి వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. కాశీ త‌మిళ సంగ‌మం ఈవెంట్‌లో పాల్గొనేందుకు సుమారు మూడు వేల మంది త‌మిళ‌నాడు భ‌క్తులు 12 బృందాలుగా కాశీ చేరుకోనున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube