టాలెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం
టీ మీడియా,ఏప్రిల్ 22, గోదావరిఖని :
పిటిడబ్ల్యూఏ మ్యాథ్స్ టాలెంట్ విజేతలు లహరి స్ఫూర్తి,రామగుండం లోని నవోదయ పాఠశాల నందు పిటిడబ్ల్యూఏ మ్యాథ్స్ టాలెంట్ పరీక్షలు మొదటి బహుమతి తాటిపల్లి లహరి,రెండవ బహుమతి పాత స్ఫూర్తి,పదవ తరగతి లు బహుమతులు పొందారు బహుమతులను పాఠశాల ఉపాధ్యాయులు ఈ.రమేష్,మధుకర్ లు అందజేశారు.
Also Read : పలు విమానాల మళ్లింపు
ఈ సందర్భంగా పిటిడబ్ల్యూఏ ప్రెసిడెంట్ కన్నూరి లక్ష్మణరావు మాట్లాడుతూ… విద్యార్థులలో పోటీతత్వం తీసుకువచ్చి వారిలో విషయపరిజ్ఞానం అల్లవరచాలని ఈ ఉన్న కాస్త సమయాన్ని పదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మంచి మార్కులతో పాసై చాలా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి కి అభినందనలు తెలియ చేయడమైనది.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.