వలు, ఊదలతో నోరూరించే రుచులు.. కొంచెం కారం, కొంచెం తీపి!

ఉలవల ఫాను, ఝంగోరా కీ ఖీర్‌

1
TMedia (Telugu News) :

వలు, ఊదలతో నోరూరించే రుచులు.. కొంచెం కారం, కొంచెం తీపి!

-ఉలవల ఫాను, ఝంగోరా కీ ఖీర్‌
టి మీడియా, జూన్25,ప్రత్యేక ప్రతినిధి: హిమాలయాల్లో పర్యాటకుల మనసులు దోచుకునే రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌ ఒకటి. అక్కడి ప్రకృతి అందాలు, దేవాలయాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో సంప్రదాయ వంటలు అంతేస్థాయిలో నోరూరిస్తాయి. ఊరించే ఉత్తరాఖండ్‌ రుచుల్లో కొన్నింటిని ఎలా వండుతారో తెలుసుకుందాం…
ఉలవల ఫాను తయారీ ఇలా!
కావలసినవి:
►ఉలవలు – కప్పు
►ఆవనూనె – అరకప్పు
►వెల్లుల్లి రెబ్బలు – ఐదు, అల్లం – అరంగుళం ముక్క
►జీలకర్ర – టీస్పూను, ఇంగువ – పావుటీస్పూను
►ధనియాల పొడి – అరటీస్పూను, పసుపు – పావు టీస్పూను
►పచ్చిమిర్చి – నాలుగు, ఉప్పు – రుచికి సరిపడా
►నెయ్యి– టీస్పూన్, కొత్తిమీర – గార్నిష్‌కు సరిపడా.

 

Also Read : ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు

 

తయారీ…
►∙ఉలవలను శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి.
►ఉదయం ఉలవలను తొక్కపోయేంత వరకు కడగాలి. దీనిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
►స్టవ్‌ మీద పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె కాగిన తరువాత రుబ్బుకున్న సగం పిండిని చిన్నచిన్న కట్‌లెట్‌లా చేసి రెండువైపులా చక్కగా కాల్చి పక్కనపెట్టుకోవాలి.
►మిగతా పిండిలో మూడుకప్పుల నీళ్లుపోసి కలపాలి
►ఇప్పుడు స్టవ్‌ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె మొత్తం వేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో తరువాత జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి.
►ఇవి వేగాక నీళ్లు కలిపిన పిండి రుబ్బు, పసుపు, ధనియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి
►∙మూత పెట్టి సన్నని మంట మీద పదినిమిషాలు మగ్గనివ్వాలి.
►తరువాత వేయించి పెట్టుకున్న కట్‌లెట్లు వేసి మరో పదినిమిషాలు ఉడికించాలి.
►పప్పు మిశ్రమం దగ్గర పడిన తరువాత కొత్తిమీర తరుగు, నెయ్యితో గార్నిష్‌ చేసి దించేయాలి. అన్నంలోకి ఇది చాలా బావుంటుంది.

Also Read : ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు

ఝంగోరా కీ ఖీర్‌
కావలసినవి
►ఊదలు – మూడు కప్పులు, పంచదార – ఐదు కప్పులు
►జీడిపప్పుపలుకులు – టేబుల్‌ స్పూను, కిస్‌మిస్‌ – అరటేబుల్‌ స్పూను
►పాలు – మూడున్నర లీటర్లు
►క్వేరా ఎసెన్స్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు
►బాదం పలుకులు – అరకప్పు.

తయారీ…
►మందపాటి పాత్రలో పాలు పోసి కాచాలి.
►కాగిన పాలలో ఊదలు వేసి ఉండలు లేకుండా కలపాలి.
►ఊదలు ఉడికిన తరువాత పంచదార వేసి కరిగేంత వరకు తిప్పుతూ ఉడికించాలి.
►పంచదార కడిగిన తరువాత క్వెరా ఎసెన్స్‌ వేసి దించేయాలి.
►ఈ మిశ్రమం చల్లారాక గిన్నెలో వేసి రిఫ్రిజిరేటర్‌లో రెండు గంటలపాటు ఉంచాలి.
►రెండు గంటల తరువాత చల్లటి ఖీర్‌లో బాదం, జీడిపలుకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube