రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ పోటీలకు తవక్కల్ విద్యార్థి

రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ పోటీలకు తవక్కల్ విద్యార్థి

1
TMedia (Telugu News) :

రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ పోటీలకు తవక్కల్ విద్యార్థి

టీ మీడియా,డిసెంబర్6,రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లా నస్పూర్ పరిధిలోని ఆక్స్ఫర్డ్ ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 2, 3 తేదీలలో జరిగిన ఇన్స్పైర్ జిల్లాస్థాయి ప్రదర్శనలో తవక్కల్ పాఠశాలకు చెందిన సాయిలాస్విక్ అనే విద్యార్థి ఉత్తమ ప్రదర్శనను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఈ ప్రదర్శనలో జిల్లా నలుమూలల నుండి 106 ఎగ్జిబిట్లు పాల్గొనగా అందులోనుండి 8 ప్రభుత్వ, 2 ప్రైవేట్ పాఠశాలల ఎగ్జిబిట్లు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. రామకృష్ణాపూర్ తవక్కల్ పాఠశాల నుండి ఒక ఎగ్జిబిట్ ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అబ్దుల్ అజీజ్, ప్రిన్సిపాల్ రామకృష్ణ లు విద్యార్థికి మెమొంటోను అందజేసి అభినందించారు. విద్యార్థి ఎగ్జిబిట్ గురించి వివరిస్తూ ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. 90 శాతం రోడ్డు ప్రమాదాలు తాగి బండ్లు నడపడం ద్వారా జరుగుతున్నాయన్నారు ఈ ప్రమాదాల వల్ల కుటుంబ యజమానిని కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతున్నాయని అన్నారు. ఈ ప్రమాదాలను తగ్గించడానికి తాను ఈ ఎగ్జిట్ ను రూపొందించానన్నారు. ఎవరైనా ఆల్కహాల్ తీసుకోని బండి స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే బండికి కనెక్ట్ చేసిన సెన్సార్లు ఇంజన్ స్టార్ట్ కాకుండా చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి, విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేందుకు, వారిని భావిభారత శాస్త్రవేత్తలుగా రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Also Read : మాతృమూర్తులకు శిక్షణ

విద్యార్థులకు విద్యతోపాటు శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల, సమాజం పట్ల తమ బాధ్యతను తెలియజేస్తూ సమాజంలో మంచి పౌరులుగా మెలిగేందుకు తమ పాఠశాలలోని ఉపాధ్యాయులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారన్నారు. అదేవిధంగా పదవ తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి జిల్లాస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచారని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube