టిబి ని నిర్లక్ష్యం చేయకండి

టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్

0
TMedia (Telugu News) :

టిబి ని నిర్లక్ష్యం చేయకండి

టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్

టీ మీడియా, మార్చి 9, రాజోలు:
క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి వెంటనే పరీక్షలు నిర్వహించి తగు జాగ్రత్తలు పాటిస్తే క్షయ వ్యాధినీ పూర్తిగా నయం చేయచ్చునని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్ తెలిపారు. గత వారం రోజులుగా రాజోలి మండల కేంద్రము లోని ఆర్ డి టి కాలనీ,తుమ్మలపల్లి గ్రామం లో ఇంటింటికీ తిరిగి వైద్య ఆరోగ్య సిబ్బంది టిబి సర్వే లు నిర్వహిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

also read:ఎంఎల్ఏ పరామర్శలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఎన్ ఎమ్ లు ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి టిబి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారి దగ్గర గళ్ళ ను సేకరించి టీ హబ్ వాహనం ద్వారా జిల్లా కేంద్రం నకు తరలించి అక్కడ లాబ్ టెక్నీషియన్ పరీక్షలు జరుపుతారని ఆయన అన్నారు. వైద్య పరీక్ష లో టిబి వ్యాధి నిర్ధారణ అయిన పక్షంలో టిబి రోగులకు టిబి మందులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. గత రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, ఆయాసం బరువు తగ్గడంతో పాటు, ఆకలి మందగించటం లాంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి అని ఆయన అన్నారు. టిబి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్, ఏ ఎన్ ఎమ్ లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube