పచ్చర్ల లో టిబి సర్వేలు

టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్

1
TMedia (Telugu News) :

పచ్చర్ల లో టిబి సర్వేలు

-టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్

టీ మీడియా, జులై 9 జోగులాంబ గద్వాల: జిల్లా అలంపూర్ నియోజక వర్గం రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామంలో టిబి సర్వే లు ముమ్మరంగా సాగుతున్నాయి అని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చందు నాయక్ మరియు క్షయ వ్యాధి నివారణ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాలకొండయ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ క్షయ వ్యాధి అనుమానిత రోగుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రోజు ఏ ఎన్ ఎమ్ లు ఆశా వర్కర్లు అందరూ ఇంటింటికీ తిరిగి టిబి సర్వే లు చేయాలని ఆయన అన్నారు. క్షయ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి వారి వివరాలు గోప్యంగా సేకరించి వారి నుంచి గళ్ళ ను సేకరించి వాటిని ప్రతి రోజూ టీ హబ్ వాహనం లో జిల్లా కేంద్రం నకు తరలించడం జరుగుతుందని ఆయన వివరించారు. దగ్గు, జ్వరం, ఆయాసం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం లక్షణాలు ఉన్న వారికి తప్పకుండా గళ్ళ డబ్బా లు ఇవ్వాలని ఆయన ఆశా వర్కర్లు కు చెప్పారు.

 

Also Read : ఘనంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క జన్మదిన వేడుకలు

గళ్ళ పరీక్ష లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా వెంటనే ఆ టిబి రోగికి 6నెలల వరకు ఉచితంగా టిబి మందులను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. గళ్ళ పరీక్ష లో గానీ, ఎక్స్ రే లో గాని, సి బి నాట్ లో గాని, అలాగే డిజిటల్ ఎక్స్ రే రిపోర్ట్ లలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా వెంటనే వారికి టిబి మందులు ఇస్తామని ఆయన అన్నారు.మందులతో పాటు పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని అందుకుగాను ప్రభుత్వము ప్రతి నెల 500రూపాయలు రోగి యొక్క బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. అందుకుగాను రోగి యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్, హెల్త్ అసిస్టెంట్ రంజిత్ కుమార్, ఏ ఎన్ ఎమ్ లు సుజాత, కిస్టమ్మ, ఆశా వర్కర్లు కమ్రున్, మల్లీశ్వరి, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube