ఎన్నికల ప్రచారానికి టీడీపీ-జనసేన కొత్త లోగో

ఎన్నికల ప్రచారానికి టీడీపీ-జనసేన కొత్త లోగో

0
TMedia (Telugu News) :

ఎన్నికల ప్రచారానికి టీడీపీ-జనసేన కొత్త లోగో

టీ మీడియా, జనవరి 2, అమరావతి : పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్‌ ఇచ్చిన రా కదలిరా పిలుపునే మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నామనితెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప జగన్‌ పాలనలో అభివఅద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని విమర్శించారు. రాష్ట్రాన్ని చీకటిమయం చేసి ఆంధ్రప్రదేశ్‌ ని ఆందోళనప్రదేశ్‌ గా మార్చిన వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి అని దుయ్యబట్టారు. ‘స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. అన్ని సభలు తెలుగుదేశం – జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయి. చంద్రబాబు- పవన్‌ కళ్యాణ్‌ కలిసి పాల్గనే సభలు త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు. పార్లమెంట్‌ స్థాయి బహిరంగ సభలతో సంబంధం లేకుండా మేనిఫెస్టో ప్రకటన సభను ప్రత్యేకంగా నిర్వహిస్తాం.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేందుకు ఎంతోమంది సంపప్రదిస్తున్నారని తెలిపారు. కొత్త, పాత వారి సమన్వయం కోసం ఓ కమిటీ ఇప్పటికే పని చేస్తోంది. వైసీపీ నుంచి వచ్చే వారి పట్ల ఆచితూచి వ్యవహరిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది.. జగన్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి నుంచి ”రా కదలి రా!” పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహించబోతోంది..

Also Read : ధూమపానానికి నిలయంగా చాయ్ దుకాణాలు

తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరించారు.. సైకిల్‌ – గాజు గ్లాసుతో కూడిన లోగోను అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. అనంతరం పంచాయితీల సమస్యలపై రేపు సర్పంచులతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. 5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని 22 పార్లమెంట్‌ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తారు.. 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో సభలు, 18న ఎన్టీర్‌ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ బహిరంగసభ ఏర్పాట్లలో పార్టీ నేతలు మునిగిపోయారు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube