టిడిపి బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిక
– జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. మధుసూధన్
టీ మీడియా, అక్టోబర్ 12, వనపర్తి బ్యూరో : దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం ఫర్దిపూర్ గ్రామానికి చెందిన టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్. నరసింహారెడ్డి , బీజేపీ మండల సీనియర్ నాయకులు సింగసాని రామేశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. మధుసూధన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జియంఆర్ తదితర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో చిన్న చింతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లమరి నరేందర్ రెడ్డి , చిన్నచింతకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగు వెంకటేష్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనందం , తెలుగు శివకుమార్, అనగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.