కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన తెదేపా నాయకులు

0
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్ 27 వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి ఆత్మకూరు పట్టాభి రామారావు నాయకత్వంలో, తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్ అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ విస్తృత స్థాయి సమావేషం జరిగింది. తదనంతరం మండలలో జరిగిన ప్రజావాన్ని కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ కి మండలంలో క్రొత్తగా ఎన్నుకోబడిన 400 మందికి వృధ్దాప్య, వితంతు, వికలాంగులు, పెన్స్ మంజూరు చేసింది. కానీ ఇంతవరకు ఎవ్వరికీ ఒక్క నయాపైసా కూడా ఇవ్వలేదు.

వారికి వెంటనే మంజూరు చేయాలని, మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను పాత భవన ములను మరమత్తులు చేయాలని, పనికిరాని వాటి స్థలములో క్రొత్త వాటిని నిర్మాణం చెయ్యాలని, వ్యవసాయం చేసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయము చేస్తున్నారని, యాసంగి వరి సాగు పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు రైతులు వేసుకునేందుకు రైతులకు తగు సూచనలు అందించే విధంగా అగ్రికల్చర్ అధికారులు సూచనలు చేసి రైతులకు లాభం గా వచ్చే విధంగా అధికారులెవరు బాధ్యత తీసుకోవడం పట్టాభి తన ఆవేదనను వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆ లోకం సంజీవరావు, జి, రామారావు, పోలిన నవీన్, చిరుత పూరి బాబు, మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

TDP leaders submit petition to collector.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube