మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

1
TMedia (Telugu News) :

మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

టీ మీడియా,సెప్టెంబర్ 16, అమరావతి : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను మరోసారి సస్పెన్షన్‌ చేశారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రంలో ధరల పెరుగుదలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అందుకు అధికారపక్షం ఒప్పుకోకపోవడంతో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. స్పీకర్‌ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించకపోవడంతో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ జోక్యం చేసుకున్నారు.రాష్ట్రంలో అనేక కీలక సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని అందుకు సభ్యులుసహకరించాలని కోరారు.

Also Read : చిరంజీవి ని వరించిన అదృష్టం

అందుకు ప్రతిపక్ష సభ్యులు ససేమిరా అనడంతో వారిని సభ నుంచి ఒకరోజు సస్పెన్షన్‌ చేయాలని ప్రతిపా దించగా సభా సభ్యుల అనుమతితో స్పీకర్‌ టీడీపీ సభ్యులను ఒకరోజుపాటు సస్పెన్షన్‌ చేశారు. సస్పెన్షన్ అయిన వారిలో ఎమ్మెల్యేలు అశోక్‌, కింజవరపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకట్‌రెడ్డి, జోగేశ్వర్‌రావు, పయ్యవుల కేశవ్‌, గద్దె రామ్మోహన్‌ రావు, వెలగపుడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌, బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube