తుమ్మల కు జై కొట్టిన టీడీపీ నేతలు..

-ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకల్లోసందడి

1
TMedia (Telugu News) :

తుమ్మల కు జై కొట్టిన టీడీపీ నేతలు..

-ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకల్లోసందడి

టీ మీడియా, నవంబర్ 29,పాలేరు : గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఎప్పుడూ కేసీఆర్ పక్కనే ఆయన కనిపించేవారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో తుమ్మల టీఆర్ఎస్‌లో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఉపేందర్ రెడ్డి కారెక్కారు. దీంతో పాలేరు నియోకవర్గంలో రెండు వర్గాలుగా టీఆర్ఎస్ విడిపోయింది. వచ్చే ఎన్నికల్లో తుమ్మల, ఉపేందర్ రెడ్డిలలో ఎవరికి టీఆర్ఎస్ టికెట్ వస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.

Also Read : పదోతరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థుల సామూహిక అత్యాచారం

టీడీపీ కార్యక్రమాల్లో..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఎన్నికల హీట్ రాష్ట్రంలో ఇప్పుడే మొదలవుతోంది. నేతలందరూ పోటీలోకి దిగేందుకు ఇప్పటినుంచే రంగం సిద్దం చేసుకుంటున్నారు. సీటు కోసం తమవంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. గత ఎన్నిల్లో ఓడిపోయి నేతలు ఈ సారి మళ్లీ సీటు సంపాదించుకునేందుకు లాబీయింగ్ చేస్తోన్నారు.గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి మళ్లీ సన్నద్దమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని చెబుతున్న ఆయన.. ఇతర పార్టీ నేతల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకల్లో తుమ్మల పాల్గొని సందడి చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.తాజాగా మరోసారి టీడీపీ నేతల సమావేశంలో తుమ్మల పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తూరు గ్రామంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తుమ్మలకే తాము మద్దతు ఇస్తామని తెలుగు తమ్ముళ్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో తుమ్మలను ఓడించుకోవడం తమ దురదృష్టమని, ఈ సారి పాలేరులో తుమ్మల పోటీ చేస్తే పార్టీలకతీతంగా గెలిపించుకుంటామంటూ వెల్లడించారు. తుమ్మల ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతుందంటూ స్థానిక టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

Also Read : వివేకా హత్యకేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ..

ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మద్దతు ఇస్తామంటూ తెలిపారు.ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి ముగ్గురు సీఎంల దగ్గర పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనకు వేరే మార్గం లేదని, తప్పకుండా ప్రజల ముందుకు వస్తానంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశం వల్లే ఖమ్మం జిల్లాలో 40 ఏళ్లు ప్రజలకు సేవ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న టీడీపీ కార్యక్రమాల్లో వరుసగా తుమ్మల పాల్గొంటుండటం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఆయన టీడీపీలోకి వెళతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తోన్నాయి. కానీ తెలంగాణలో టీడీపీ బలంగా లేకపోవడం వల్ల తుమ్మల సైకిలెక్కే అవకాశాలు అసలు లేవు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసమే ఇలా ఇతర పార్టీల నేతలను కూడా కలుపుకుంటున్నారనే అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్స్‌లో వ్యక్తమవుతోన్నాయి.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube