పార్ధ ఛ‌ట‌ర్జీ ఆస్తులపై ఈడీ ఆరా

పెంపుడు కుక్క‌ల కోస‌మే ఓ ల‌గ్జ‌రీ ఫ్లాట్‌

1
TMedia (Telugu News) :

పార్ధ ఛ‌ట‌ర్జీ ఆస్తులపై ఈడీ ఆరా

-పెంపుడు కుక్క‌ల కోస‌మే ఓ ల‌గ్జ‌రీ ఫ్లాట్‌
టి మీడియా,జూలై25,కోల్‌క‌తా : టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట‌యిన బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్ధా ఛ‌ట‌ర్జీ భారీగా ఆస్తులు కూడ‌బెట్టిన‌ట్టు వెల్ల‌డైంది. ఆయ‌న‌కు కేవ‌లం కుక్క‌ల కోస‌మే ఓ ల‌గ్జరీ ఫ్లాట్ ఉందంటే ఇక ఏ స్ధాయిలో ఆస్తులున్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు. అరెస్ట‌యిన‌ప్ప‌టి నుంచి పార్ధా ఛ‌ట‌ర్జీ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన తీరును ఈడీ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది.బెంగాల్ డైమండ్ సిటీలో పార్ధా ఛ‌ట‌ర్జీకి మూడు ఖ‌రీదైన ఫ్లాట్లు ఉన్నట్టు ఈడీ గుర్తించింది. వీటిలో ఒక‌టి పూర్తి ఎయిర్‌కండిష‌న్డ్ ఫ్లాట్‌ను కేవ‌లం ఓ అపార్ట్‌మెంట్ కేటాయించారు.

 

Also Read : కూలిన శిక్ష‌ణ విమానం : మ‌హిళా పైలట్‌కు గాయాలు

 

బెంగాల్‌లో టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ స్కాం కేసుకు సంబంధించి పార్ధ‌ఛ‌ట‌ర్జీని శ‌నివారం ఈడీ అరెస్ట్ చేసింది. మంత్రి సన్నిహితురాలు అర్పిత ముఖ‌ర్జీ ఇంట్లో భారీ మొత్తంలో న‌గ‌దు పట్టుబ‌డిన నేప‌ధ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.పార్ధ ఛ‌టర్జీ ఓ ఫ్లాట్‌ను సైతం అర్పిత ముఖ‌ర్జీకి గిఫ్ట్‌గా ఇచ్చార‌ని వెల్ల‌డైంది. శాంతినికేత‌న్‌, బోల్పూర్‌లో పార్ధ ఛ‌ట‌ర్జీ, అర్పిత ముఖ‌ర్జీల‌కు జాయింట్‌గా ఓ ఫ్లాట్ ఉంద‌ని, ఇవి కాకుండా పార్ధ ఛ‌ట‌ర్జీకి మ‌రో మూడు ఫ్లాట్లు ఉన్నాయ‌ని ఈడీ గుర్తించింది. ఇక శాంతినికేత‌న్ ప్రాంతంలో పార్ధ ఛ‌ట‌ర్జీకి చెందిన‌విగా భావిస్తున్న మురో ఏడు ఇండ్లు, ఆపార్ట్‌మెంట్లపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube