విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ

స్మార్ట్ కిడ్జ్" పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్

1
TMedia (Telugu News) :

విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేళ

-“స్మార్ట్ కిడ్జ్” పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్
టీ మీడియా,సెప్టెంబర్ 5,ఖమ్మం:
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని “స్మార్ట్ కిడ్జ్” పాఠశాలలో “సెల్ఫ్ గవర్నమెంట్” ను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల వేషాధారణలో విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ అలరించారు. విద్యార్థులు అన్ని క్లాసులలో పాఠ్యాంశాలను బోధిస్తూ అబ్బురపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం చిన్నారుల సృజనాత్మకత ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, శిష్యుల అర్హతను ప్రతిభను ఎప్పటికప్పుడు అంచనా వేసి వారికి ఎలాంటి జ్ఞానం కావాలో అందించిన వారే నిజమైన గురువులని ఆయన అన్నారు.

Also Read : లోబీపీతో ఇబ్బందా..? ఇదిగో టిప్స్‌ మీ కోసం..

సమాజ గమనాన్ని మార్చేది గురువేనని, నవ సమాజ నిర్మాణంలో గురువు పాత్ర కీలకమైనదని, నాటి పురాణాల నుండి నేటి కంప్యూటర్ యుగం వరకు కూడా గురువు స్థానం మారలేదని, మొక్కవోని దీక్షతో విద్యార్థులను తీర్చిదిద్దే శిల్పి గురవేనని, కష్టపడి చదివి కృషి, పట్టుదల,ఏకాగ్రత క్రమశిక్షణతో తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని సన్మార్గంలో ప్రయాణించి ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విద్యార్థుల ఉపాధ్యాయులుగా మారి చక్కగా బోధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube