కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ౦

కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ౦

1
TMedia (Telugu News) :

కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ౦
టీ.మీడియా,సెప్టెంబర్,6 ,చింతూరు:
స్ధానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారతదేశ మొదటి ఉప రాష్ట్ర పతి, తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ 134వ జన్మదినం సంధర్భంగా సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె.రత్నమాణిక్య౦ తెలియజేసారు. తొలుత చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి తగిన గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిన రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం గురువుల౦దరికి గర్వకారణమన్నారు.

Also Read : కుటుంబ‌ అవ‌స‌రాల కోసం.. ట‌ర్మ్ బీమా పాల‌సీ బెస్ట్‌

వ్తెస్ ప్రిన్సిపాల్ జి. వెంకటరావు మాట్లడుతుా రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడం తో పాటు వారిపై ప్రేమానురాగాలు చుాపే వారన్నారు. మైసూర్ నుండి కలకత్తా కు ప్రాఫెసర్ గా వెళ్ళేటప్పుడు గుర్రపు బ౦డి ని పూలతో అల౦కరి౦చి ,తమ గురువును కుార్చోబెట్టి రైల్వే స్టేషన్ వరకు విద్యార్ధులే లాక్కుంటూ వెళ్లడాన్ని బట్టి ఆయన గొప్పతనం తెలుస్తుందన్నారు.ఈ కార్య క్రమంలో అధ్యాపకులు ఎమ్.శేఖర్, డా. వై. పద్మ , ఎస్.అప్పనమ్మ, K.శమంతల, జి హారతి, కె. శైలజ, ch.రాజబాబు, K. శ్రీలక్ష్మి, K. శ్రీదేవి, లక్ష్మణ్, ఏడుకొ౦డలు,R.మౌనిక, పి. గౌతమి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube