ఆర్థిక సహకారం అందించిన ఉపాధ్యాయ బృందం

ఆర్థిక సహకారం అందించిన ఉపాధ్యాయ బృందం

1
TMedia (Telugu News) :

ఆర్థిక సహకారం అందించిన ఉపాధ్యాయ బృందం

టి మీడియా, ఆగస్టు 3 వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల వీరభద్రారం గ్రామానికి చెందిన మంచర్ల జగదీష్ చెన్నూరు జెడ్ పీ టీ సీలో యస్ ఎ సోషల్ ఉపాధ్యాయుడిగా 2019 లో చేరారు‌. 2020లో వివాహ జరుగగా 2021న ఎలక్షన్ డ్యూటీ చేసి తిరిగి వస్తున్న క్రమంలో కరోనా మహమ్మారి అంటుకోవటంతో స్వర్గస్థులైయ్యారు. అతనికి భార్య అనిత, 3 నెలల పాప ఉంది. సీపియస్ ఉద్యోగి కావడం, 20 నెలల సర్వీసు వ్యవధి ఉండటం చేత ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కుటుంబానికీ అందలేదు. ఈ నేపద్యంలో ఖమ్మం జిల్లా పీ ఆర్ టీ యు ఉపాధ్యాయుల మానవత్వం చాటుకున్నారు.

 

Also Read : ప్రేమోన్మాది ఘాతుకం..

 

పీ ఆర్ టీ యు అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంతో రూ 1 లక్ష 21వేల రూపాయలు ఏర్పాటు చేసి, విశ్రాంతి ఉపాధ్యాయులు దొడ్డి తాతారావు సమక్షంలో పీ ఆర్ టీ యు జిల్లా అధ్యక్షులు శ్రీ మోతుకూరి మధు, ప్రధాన కార్యదర్శి ఆర్ రంగారావు, మాజీ జిల్లా అధ్యక్షులు ఎన్ కృష్ణమోహన్ చేతుల మీదుగా భార్య అనితకు అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీ విజయ అమృత, విశ్రాంతి ఉపాధ్యాయులు వెంకట నర్సయ్య కల్లూరి, మండల పీ ఆర్ టీ యు అధ్యక్షుడు శ్రీ పాకాల రమేష్, వానపల్లి సునీత, రాష్ట్ర బాధ్యులు శ్రీ యలమద్ది వెంకటేశ్వర్లు, పఠాన్ రహీం, రాష్ట్ర నాయకులు ఉస్మాన్ అలీ, జిల్లా బాధ్యులు శ్రీ బోబోలు శ్రీనివాసరావు, మండల బాధ్యులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube