టీమ్ ఇండియా ఔట్.. -10 వికెట్లతో ఇంగ్లాండ్ విన్

టీమ్ ఇండియా ఔట్.. -10 వికెట్లతో ఇంగ్లాండ్ విన్

1
TMedia (Telugu News) :

టీమ్ ఇండియా ఔట్.. -10 వికెట్లతో ఇంగ్లాండ్ విన్

టి మీడియా, నవంబరు 10,ఢిల్లీ : టీ20 ప్రపంచకప్​ 2022లో భారత్​కు మరోసారి నిరాశ ఎదురైంది. రెండో సెమీఫైనల్​ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ అలవోకంగా ఛేదించేసింది. ఓపెనర్లు హేల్స్​, బట్లర్ ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు తీర్చారు. దీంతో ఫైనల్​ చేరిన ఇంగ్లాండ్​.. పాకిస్థాన్​తో తలపడనుంది.169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అలెక్స్​ హేల్స్(86*)​, జోస్​ బట్లర్(80*)​ సిక్సులు, ఫోర్​లతో రెచ్చిపోయారు. టీమ్​ఇండియా బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఇంకా నాలుగు ఓవర్లు మిగలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేశారు.తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

Also read : సిసి రోడ్డుల పరిశీలనచేసిన కాంగ్రెస్ కమిటీ సభ్యులు

హార్దిక్‌ పాండ్య (63) దూకుడుగా ఆడేశాడు. విరాట్ కోహ్లీ (50) మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ (27) ఫర్వాలేదనిపించినా ధాటిగా ఆడలేకపోయాడు. కేఎల్ రాహుల్ (5), రిషభ్‌ పంత్ (6), సూర్యకుమార్ (14) పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్ జొర్డాన్ 3.. క్రిస్‌ వోక్స్, అదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ తీశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube