తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
టీ మీడియా, అక్టోబర్ 9, న్యూఢిల్లీ : తెలంగాణలో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నాం. 40 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో పర్యటించాం. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నాం అని తెలిపారు. తెలంగాణలో 119, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరాంలో 40, రాజస్థాన్‌లో 200, మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొన్నారు. మొత్తంలో ఐదు రాష్ట్రాల్లో 679 శాసనసభ స్థానాలున్నాయని తెలిపారు.
Also Read : ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో
మిజోరాం శాసనసభ పదవీకాలం డిసెంబర్ 17, ఛత్తీస్‌గఢ్ జనవరి 3, మధ్యప్రదేశ్ జనవరి 8, రాజస్థాన్ జనవరి 14, తెలంగాణ శాసనసభ పదవీకాలం జనవరి 18 ముగియనున్నట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో 8.2 కోట్ల మంది పురుష ఓటర్లు, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో 60.2 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube