తెలంగాణ బ‌డ్జెట్ 2022-23

తెలంగాణ బ‌డ్జెట్ 2022-23

1
TMedia (Telugu News) :

తెలంగాణ బ‌డ్జెట్ 2022-23

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభ‌మ‌య్యాయి. 2022-23 వార్షిక బడ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌వేశ‌పెట్టి, బ‌డ్జెట్ పాఠాన్ని చ‌దువుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల‌కు ఫ్యామిలీ పెన్ష‌న్ పాల‌సీరాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. విధి నిర్వ‌హ‌ణ‌లో మ‌ర‌ణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల‌కు ఫ్యామిలీ పెన్ష‌న్ పాల‌సీని వర్తింప‌జేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్నారు. ఇవాళ దేశంలోనే అత్య‌ధిక స్థాయిలో వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఎవ‌రైనా ఉన్నారంటే వారు.. తెలంగాణ ఉద్యోగులే అని స‌గ‌ర్వంగా ప్ర‌క‌టిస్తున్నాన‌ని తెలిపారు. హోంగార్డులు, అంగ‌న్‌వాడీ, ఆశా వ‌ర్క‌ర్లతో పాటు త‌దిత‌ర సిబ్బంది ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు స‌మానంగా 30 శాతం వేత‌న పెంపును అందుకున్నారు.పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి రూ.4724 కోట్లు

also read: ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో పల్లె ప్రగతికి రూ.3330 కోట్లు, పట్టణప్రగతికి రూ.1394 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాలకు కలిపి రూ.రూ.4724 కోట్లు ప్రతిపాదించింది.మార్చి నాటికి 40వేల కుటుంబాలకు లబ్ధిఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2,616 వైన్స్‌ షాప్‌లో 261 మద్యం దుకాణాలు దళితులకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. లైసెన్స్‌లు పొందిన కుటుంబాలు తాము కలలో కూడా ఊహించని అద్భుతమని సంబురపడ్డారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పథకం ద్వారా మార్చి నెలాఖరు నాటికి 4వేలకోట్లతో దాదాపు 40వేల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుందన్నారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తుందన్నారు.

also read: మాజీలు సమావేశం

అందు కోసం.. దళిత రక్షణ నిధిదళిత బంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైన సమయంలో ఆ కుటుంబం పరిస్థితి దిగజారిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం దళిత రక్షణ నిధి ఏర్పాటు చేసిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆపద సమయంలో ఈ నిధి వారికి కవచంగా నిలుస్తుందన్నారు. దళితబంధు పథకంలో భాగంగా ప్రభుత్వ లైసెన్స్‌లు పొంది ఏర్పాటు చేసుకునే వైన్స్‌ షాపులు బార్‌ షాపులు, వివిధ రకాల కాంటాక్టులు తదితర వాటిలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
లింకేజీ లేదు.. నచ్చిన పని చేసుకోవచ్చు..
గత ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను బ్యాంకు లింకేజీలను, కొలాటరల్‌ సెక్యూరిటీలతో ముడి పెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదని, దళిత బంధు పథకానికి బ్యాంకు లింకేజీ లేదని స్పష్టం చేశారు. దీంతో పాటు పథకం లబ్ధిదారులకు నచ్చిన పనిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్‌ రూపంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందివ్వడం తెలంగాణ దళిత బంధు పథకం గొప్పదనమని చెప్పారు.

దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ
దళిత జాతి ఆర్థిక ప్రగతి సాధించిన నాడు సామాజిక అంతరాలు క్రమక్రమంగా అంతరిస్తాయని, మానవ సంబంధాలు సమానత్వంతో పరిమళిస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రగతి దళిత కుటుంబానికి ఉపాధి కోసం రూ.10లక్షల ఉచిత ఆర్థిక సాయం అందించడంలో దళితబంధు ఓ భాగమని, ఇంత పెద్ద నగదు మొత్తాన్ని ఇంత వరకు ఏ పథకం ద్వారా ఎన్నడూ ఇవ్వలేదని చెప్పారు. దళిత కుటుంబానికి ఇంతటి భారీ ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తున్న పథకం అతిపెద్ద నగదు బదిలీ పథకంగా చరిత్రకెక్కిందన్నారు

అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో..
భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ‘దళితబంధు’ అనేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.. తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికాన్ని, సామాజిక వివక్షను అంతమొందటించే ఆయుధం ‘తెలంగాణ దళితబంధు’.. ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదన్నారు. దళితబంధు దళితబంధు కేవలం ఒక పథకం మాత్రమే కాదని.. ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని, వికాసాన్ని చేకూర్చే ఒక దృక్పథం.. ఒక సమర్థవంతమైన విధానమన్నారు.
సామాజిక వివక్షను అంతమొందించే ఆయుధం ‘దళిత బంధు’
సామాజిక వివక్షను అంతమొందటించే ఆయుధం ‘తెలంగాణ దళితబంధు’ అనీ, ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ పాఠాన్ని ప్రసంగిస్తూ.. శం నేడు స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు జరుపుకుంటోందని, 75 ఏళ్ల స్వాతంత్ర్యం సాక్షిగా దళిత జాతి సాధికరత అనేది కలగా మిగిలిపోయిందని హరీశ్‌రావు అన్నారు.

also read: మీడియా పాత్ర అత్యంత కీలకం

తెలంగాణ‌ భ‌వ‌న నిర్మాణ రంగ కార్మికుల‌కు శుభ‌వార్త‌..
రాష్ట్ర వ్యాప్తంగా భ‌వ‌న నిర్మాణ రంగంలో ప‌ని చేస్తున్న కార్మికుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. కార్మికుల కోసం స‌రికొత్త ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. మొద‌టి విడుత‌లో భాగంగా భ‌వ‌న నిర్మాణ రంగంలోని ప‌ని చేస్తున్న ల‌క్ష మందికి స‌బ్సిడీపై మోటార్ సైకిళ్ల‌ను అంద‌జేయాల‌ని సీఎం కేసీఆర్ సంక‌ల్పించిన‌ట్లు హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రానికి..
హైద‌రాబాద్ మెట్రో ప‌రిధిలో రోజుకు 20 లీట‌ర్ల ఉచిత నీటి ప‌థ‌కానికి రూ. 300 కోట్లు
పాత‌బ‌స్తీలో మెట్రో రైలు కోసం రూ. 500 కోట్లు
అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు
ఎయిర్‌పోర్టు మెట్రో అనుసంధానానికి రూ. 500 కోట్లు
హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు రూ. 1500 కోట్లు
హైద‌రాబాద్‌, ఓఆర్ఆర్ చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొర‌త‌ను తీర్చేందుకు రూ. 1200 కోట్లు

ప‌ల్లెల అభివృద్ధికి మ‌రిన్ని నిధులు..
ప‌ల్లె ప్ర‌గ‌తికి రూ. 3330 కోట్లు
ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి రూ. 1394 కోట్లు
హ‌రిత‌హారానికి రూ. 932 కోట్లు

సంక్షేమానికి పెద్ద‌పీట‌
ద‌ళిత‌బంధుకు రూ. 17,700 కోట్లు
ఎస్టీల సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
బీసీల సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు
క‌ల్యాణ‌లక్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు

బ్రాహ్మ‌ణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు
దూప దీప నైవేద్య ప‌థ‌కానికి రూ. 12.50 కోట్లు

వ్య‌వ‌సాయానికి భారీగా నిధులు..
వ్య‌వ‌సాయ రంగానికి రూ. 24,254 కోట్లు
పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు
రాష్ట్రంలో 2.5 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ సాగు ల‌క్ష్యం.
రైతులకు శుభ‌వార్త‌..
వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చి లోపు మాఫీ
పంట రుణాలు మొత్తం రూ. 16,144 కోట్లు మాఫీ
ఈ ద‌ఫా 5.12 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రుణాలు మాఫీ

అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు
దళితబంధుకు రూ.17,700 కోట్లు. దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి. అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు చరిత్ర సృష్టించింది. బ్యాంకు లింకులు లేవు. నిబంధనలు లేవు.
ఆస‌రా పెన్ష‌న్ల‌కు రూ. 11,728 కోట్లు
ఆస‌రా పెన్ష‌న్ల‌కు రూ. 11,728 కోట్లు

స‌డ‌లించిన వ‌యోప‌రిమితి ప్ర‌కారం కొత్త ల‌బ్ధిదారుల‌కు ఆస‌రా పెన్ష‌న్లు
క‌ల్యాణ‌లక్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు

also read:కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు

నిరుపేద‌లకు గుడ్ న్యూస్..
సొంత స్థ‌లంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం
సొంత స్థ‌లాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం
సొంత‌స్థ‌లం ఉన్న 4 ల‌క్ష‌ల మందికి రూ. 3 ల‌క్ష‌ల ఆర్థిక సాయం
నియోజ‌క‌వ‌ర్గానికి 3 వేల ఇండ్లు కేటాయింపు
ఎమ్మెల్యేల ప‌రిధిలో 3.57 ల‌క్ష‌ల ఇండ్లు కేటాయింపు
నిర్వాసితులు, ప్ర‌మాద బాధితుల‌కు 43 వేల ఇండ్లు కేటాయింపు
సీఎం ప‌రిధిలో నిర్వాసితులు, ప్ర‌మాద‌బాధితుల‌కు ఇండ్ల కేటాయింపు

మోటార్లకు మీటర్లు పెట్టబోం
మోటార్లకు మీటర్లు పెట్టబోం. విద్యుత్‌ సంస్కరణలకు ఒప్పుకోం. ఒక్క ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క పథకానికి డబ్బులు ఇవ్వలేదు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన డబ్బును సెస్‌ రూపంలో దోచుకుంటోంది. 27శాతం ఆదాయం కూడా రావట్లేదు.

వ్య‌వ‌సాయ రంగానికి రూ. 24,254 కోట్లు
వ్య‌వ‌సాయ రంగానికి రూ. 24,254 కోట్లు
పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు
రాష్ట్రంలో 2.5 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ సాగు ల‌క్ష్యం.
హ‌రిత‌హారానికి రూ. 932 కోట్లు

రైతుల రుణాలు మాఫీ
వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చి లోపు మాఫీ
పంట రుణాలు రూ. 16,144 కోట్లు మాఫీ
ఈ ద‌ఫా 5.12 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రుణాలు మాఫీ
కేంద్రం తీరుతో తెలంగాణకు 5వేలకోట్ల నష్టం
ఆర్థిక సంఘం సూచనలు కేంద్రం పట్టించుకోలేదు. కరోనా సమయంలోనూ కేంద్రం అదనంగా రూపాయి ఇవ్వలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ నిబంధనలు విధించింది. కేంద్రం తీరుతో రాష్ట్రం ఏటా 5వేల కోట్లు నష్టపోతోంది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోతున్నాం.

కేంద్రం వైఖరి కాళ్లల్లో కట్టెబెట్టినట్లుంది..
కేంద్రం వైఖరి కాళ్లల్లో కట్టెబెట్టినట్లుంది. తెలంగాణ పురటి దశల్లో ఉన్నప్పటి నుంచే కేంద్రం దాడి మొదలైంది. ఐదేళ్లపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసింది. ఐటీఆర్‌ ఇచ్చుంటే తెలంగాణ ఐటీ రంగంలో పురోగమించేది. కో ఆపరేటివ్‌ ఫెడరల్‌ స్ఫూర్తి అని గొప్పగా చెబుతూనే.. ఫెడరల్‌ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీస్తోంది.

also read: తడి చేత్త నుంచి కంపోస్టు

తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు స‌స్పెండ్
తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్ చేశారు. బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డుప‌డుతున్న ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావును సస్పెండ్ చేశారు. స‌భ ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

ద‌ళిత‌బంధుకు రూ. 17,700 కోట్లు
ద‌ళిత‌బంధుకు రూ. 17,700 కోట్లు
ప‌ల్లె ప్ర‌గ‌తికి రూ. 3330 కోట్లు
ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి రూ. 1394 కోట్లు
కొత్త వైద్య కాలేజీల‌కు రూ. 1000 కోట్లు
అట‌వీ విశ్వ‌విద్యాల‌యాల‌కు రూ. 100 కోట్లు
)
దేశంలో తెలంగాణ ఓ టార్చ్‌ బేరర్‌
ఇదే సభలో గతంలో ఒకప్పుడు పేగులు తెగేదాక కొట్లాడాం. కరెంటు కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవు. కరెంటు కోతల నుంచి 24 గంటల విద్యుత్‌ కాంతులు సాధించింది. దేశంలో తెలంగాణ ఓ టార్చ్‌ బేరర్‌. ఖజానకు ఎంత ధనం చేరిందన్నది కాదు. ప్రజలకు ఎంత మేలు చేకూర్చామన్నది ముఖ్యం.

తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను సీఎం కేసీఆర్‌ భుజాలపై వేసుకున్నరు : హరీశ్‌రావు
రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను కేసీఆర్‌ భుజాలపై వేసేసుకున్నారు. పోరాట దశ నుంచి ఆవిర్భావం వరకు తెలంగాణ కొత్త రూపం సంతరించుకున్నది. సవాళ్లను, క్లి్ష్టమైన సమస్యలను అధిగమించాం. పరిపాలనలో రాజీలేని వైఖరిని అవలంభించింది. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ. ఆసరా, రైతుబంధు.. ఇలా ఏ పథకమైనా లబ్ధిదారులకు చేరుతుంది.
రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌
రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌వేశ‌పెట్టారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు కాగా, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లు.

also read:నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఎంపీటీసీ సత్యం

అద్భుత ప్ర‌గ‌తి సాధించాం..
రాష్ట్రం ఆవిర్భవించిన అన‌తికాలంలో అద్భుత ప్ర‌గ‌తి సాధించాం. సీఎం ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ ప్ర‌గ‌తి ప‌థంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ప‌రిపాల‌న‌లో రాజీలేని వైఖ‌రిని టీఆర్ఎస్ అవ‌లంభించింది. కరెంట్ కోత‌లు, ఆక‌లి చావులు ఇప్పుడు లేవు.

అసెంబ్లీలో స్పీక‌ర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉద‌యం 11 గంట‌ల‌కు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ కార్య‌ద‌ర్శి న‌ర‌సింహాచార్యులు సీఎం కేసీఆర్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం క‌లిశారు. సీఎం వెంట మంత్రులు హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.

అసెంబ్లీకి చేరుకున్న మంత్రులు హ‌రీశ్‌రావు, ప్ర‌శాంత్ రెడ్డి
ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ ఖాద్రీని మంత్రులు క‌లిసి బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను అందించారు.
ఫిల్మ్ న‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర స్వామి టెంపుల్‌లో హ‌రీశ్ రావు పూజ‌లు
రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా ఫిల్మ్ న‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆల‌య అర్చ‌కులు మంత్రిని ఆశీర్వ‌దించి తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. అక్క‌డ్నుంచి నేరుగా హ‌రీశ్‌రావు అసెంబ్లీకి బ‌యల్దేర‌నున్నారు.

also read:శ్రీశైలం సాగర్‌ నిర్వహణమార్గదర్శకాలను ఖరారు చేయండి

07 Mar 2022 09:48 AM (IST)
భారీ బందోబ‌స్తు
బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో అసెంబ్లీ వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. సుమారు 2,500 మంది పోలీసుల‌తో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప‌రిస‌ర ప్రాంతాల్లో 144 సెక్ష‌న్ విధించారు. న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ బందోబ‌స్తు ఏర్పాట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ప్ర‌తిబింబించేలా బ‌డ్జెట్
సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో మూడోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నాన‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ప్ర‌తిబింబించేలా బ‌డ్జెట్ ఉంటుంది. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేరేలా బ‌డ్జెట్ ఉంటుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

మంత్రి హరీశ్‌రావుకు ఇది మూడో బడ్జెట్‌
మంత్రి హరీశ్‌రావుకు ఇది మూడో బడ్జెట్‌. టీఆర్‌ఎస్‌ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019-20లో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు 2020-21 నుంచి వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube