తెలంగాణ ధాన్యం సేకరణపై దద్దరిల్లిన లోక్సభ
-రాష్ట్ర రైతంగాన్ని పట్టించుకోకపోవడం సరికాదు
ఎంపీ నామ నాగేశ్వరరావు
టీ మీడియా,ఏప్రిల్ 6,న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో రైతన్న ఆరుగాలం కష్టించి పండించే ధాన్యాన్ని కేంద్రం సేకరించకపోవడంపై ఆగ్రహిస్తూ మంగళవారం లోక్సభలో టీఆర్ఎస్ ఆందోళనలతో సభ దద్దరిల్లింది. టీఆర్ఎస్ ఎంపీల నినాదాలు, ప్లకార్డులతో సభ పలుమార్లు స్తంభించింది. ధాన్యం సేకరణపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం నోటీసులను టీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు సభ ప్రారంభం కాగానే ఇచ్చారు. రాష్ట్రంలో పండిన పంట కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ ఎఫ్ సీఐ సేకరణ చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చ చేయాలని అభ్యర్థించారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం పై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం చాలా ముఖ్యమైనదని, అందుచేత సభ ఈ రోజు కార్యక్రమాలు రద్దు చేసి… ఈ అంశంపై చర్చించాలని విన్నవించారు. అయితే, ఎంపీ నామ నాగేశ్వరరావు విజ్ఞప్తిని స్పీకర్ ఓంబిర్లా తిరస్కరించారు. దీంతో ఒక్కసారిగా ఎంపీ నామ నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకి అన్యాయం చేయవద్దని ఆగ్రహంతో నినాదాలు చేశారు.
Also Read : బలహీనవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రాం :ఎంపీ నామ
వరి కొనుగోళ్ల కోసం నిర్ధిష్టమైన విధానం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఆహార ధాన్యాల సేకరణ కోసం జాతీయ విధానం తేవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వి వాంట్ జస్టిస్… వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల నుంచి వాకౌట్ చేసి పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహాం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడి ఎదుగుతున్న రాష్ట్ర రైతంగాన్ని పట్టించుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించారు. తాము ఏమి గొంతమ్మ కోరికలు కోరడం లేదని…. తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనమంటున్నామని గుర్తుచేశారు. అది కూడా చేయలేని స్థితిలో కేంద్రం ఉండటం దారుణం అన్నారు. కేంద్రం కొనేదాకా తాము ఈ విషయంలో ఆందోళన చేస్తామన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube