వచ్చే ఏడాది సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

వచ్చే ఏడాది సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

0
TMedia (Telugu News) :

వచ్చే ఏడాది సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

టీ మీడియా, డిసెంబర్ 12, హైదరాబాద్ : వచ్చే ఏడాది 2024 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల జాబితాను ప్రకటించింది. 2024 సంవత్సరంలో సాధారణ సెలవులు 27, ఐచ్ఛిక సెలవులు(ఆప్షనల్ సెలవులు) 25 ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే.. 2024 జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సర్కార్ సెలవును ప్రకటించింది. దీనికి బదులు ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటించింది.

Also Read : పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

సాధారణ సెలవుల జాబితా :
జనవరి 1, జనవరి 14 (భోగీ), జనవరి 15 (సంక్రాంతి), జనవరి 26 (రిపబ్లిక్ డే), మార్చి 8 (మహాశివరాత్రి), మార్చి 25 (హోలీ), మార్చి 29 (గుడ్ ఫ్రైడే), ఏప్రిల్ 5 (బాబూ జగ్జీవన్‌రాం జయంతి), ఏప్రిల్ 9 (ఉగాది) , ఏప్రిల్ 11, 12 (రంజాన్), ఏప్రిల్ 14 (అంబేద్కర్ జయంతి), ఏప్రిల్ 17 (శ్రీరామనవమి), జూన్ 17 (బక్రీద్), జూలై 17 (మొహర్రం), జూలై 29 (బోనాలు), ఆగస్ట్ 15 (ఇండిపెండెన్స్ డే), 26 (శ్రీకృష్ణాష్టమి), సెప్టెంబర్ 7 (వినాయక చవితి), సెప్టెంబర్ 16 (ఈద్ మిలాద్ ఉన్ నబీ), అక్టోబర్ 2 (గాంధీ జయంతి), అక్టోబర్ 12, 13 (విజయదశమి), అక్టోబర్ 24 (దీపావళి), నవంబర్ 25 (గురునానక్ జయంతి), డిసెంబర్ 25, 26 (క్రిస్మస్) ఉన్నాయి.

Also Read : మహాలక్ష్ములు తస్మాత్ జాగ్రత్త

ఆప్షనల్ సెలవుల జాబితా :
జనవరి 16 (కనుమ), జనవరి 25 (హజ్రత్ అలీ బర్త్ డే), ఫిబ్రవరి 8 (షబ్ ఈ మిరాజ్), ఫిబ్రవరి 14 (శ్రీ పంచమి), ఫిబ్రవరి 26 (షబ్ ఈ బరత్), మార్చి 31 (షహదత్ హజత్ అలీ), ఏప్రిల్ 7 (షబ్ ఈ ఖదర్), ఏప్రిల్ 14 (తమిళ్ న్యూ ఇయర్స్ డే), ఏప్రిల్ 21 (మహావీర్ జయంతి), మే 10 (బసవ జయంతి), మే 23 (బుద్ధ పూర్ణిమ), జూన్ 25 (ఈద్ ఇ ఘదీర్), జూలై 7 (రత్నయాత్ర), జూలై 16 (మొహర్రం), ఆగస్టు 16 (వరలక్ష్మీ వ్రతం), ఆగస్టు 19 (శ్రావణ పూర్ణిమ) , అక్టోబర్ 10 (దుర్గాష్టమి), అక్టోబర్ 11 (మహార్నవమి), అక్టోబర్ 30 (నరక చతుర్ది), నవంబర్ 16 (సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహదీ జయంతి) సెలవులు ప్రకటించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube