సుప్రీంను ఆశ్ర‌యించిన తెలంగాణ ప్రభుత్వం

సుప్రీంను ఆశ్ర‌యించిన తెలంగాణ ప్రభుత్వం

0
TMedia (Telugu News) :

సుప్రీంను ఆశ్ర‌యించిన తెలంగాణ ప్రభుత్వం

టీ మీడియా, మార్చి 2, న్యూఢిల్లీ : రాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్య‌వ‌హారంపై తెలంగాణ స‌ర్కార్ సుప్రీంకోర్టు ను ఆశ్ర‌యించింది. 10 బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఆమోదించ‌క‌పోవ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌లో ప్ర‌తివాదిగా త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేరును చేర్చారు. బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ రేపు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌ర్ నుంచి 7 బిల్లులు, గ‌త నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

Also Read : ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయి : ప్రధాని మోడీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube