తెలంగాణ ప్రభుత్వంపై మండిపడిన అక్బరుద్దీన్

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడిన అక్బరుద్దీన్

1
TMedia (Telugu News) :

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడిన అక్బరుద్దీన్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా మూడేళ్ల నుంచి ఇవ్వడం లేదన్నారు. ఆరోగ్యశాఖలో ప్రభుత్వం చెబుతున్నంత పనితీరు లేదన్నారు. టీమ్స్ హాస్పిటల్ ఘనంగా ఓపెన్ చేసి ఎందుకు మూసివేశారో తెలీదన్నారు. మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అక్బరుద్దీన్ ఆరోపించారు. అభినందనలు మాత్రమే కాదు.. విమర్శలను సైతం ప్రభుత్వం సానుకూలంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం మంచి చేస్తోందని కానీ ఇంకా చేయాల్సి ఉందన్నారు. వచ్చే ప్రభుత్వం టీఆరెస్‌దేనని.. తాము కూడా కలిసి పనిచేస్తామన్నారు. బంగారు తెలంగాణ అభివృద్ధిలో టీఆర్ఎస్‌‌తో ఎంఐఎం కలిసి ముందుకు వెళుతుందని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube