తెలంగాణ వడ్లను బేషరతుగా కేంద్రం సేకరించాల్సిందే

హక్కుల్ని కొట్లాడి సాధించుకుంటాం

1
TMedia (Telugu News) :

తెలంగాణ వడ్లను బేషరతుగా కేంద్రం సేకరించాల్సిందే

-హక్కుల్ని కొట్లాడి సాధించుకుంటాం
– రాజీలేని పోరాటం
మోటర్ సైకిల్ ర్యాలీలోమంత్రి పువ్వాడ టీ మీడియా,ఏప్రిల్ 09,ఖమ్మం :తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనాలని మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి వరిధాన్యం కేంద్రం సేకరించాలని, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఖమ్మం టీఆర్ఎస్ నగర కమిటీ అధ్వర్యంలో నల్ల జెండాలతో చేపట్టిన మోటర్ సైకిల్ ర్యాలీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొన్నారు.రైతులకు సంఘీభావంగా రైతు ఇండ్లపై నల్ల జెండా ఎగురవేసి నిరసన కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పువ్వాడ వివారించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్దంగాజిల్లా కేంద్రంలో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతీ రైతు ఇంటిమీద నల్లజెండా ఎగరేసామన్నారు.

Also Read : ఎంపీ నామ ఇంటిపై నల్లజెండా ఎగురవేత

కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరి విరమించుకొని బేషరతుగా తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొంటామనే వరకూ నల్లజెండా ఎగురుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.రైతుల భవిష్యత్ ఏమవుతుందో అనే ఆందోళనతోనే కేసీఆర్ గారు రైతుబందు, బీమా, 24గంటల ఉచిత కరెంటు, నీళ్లిచ్చారు, వీటివల్ల ఇప్పుడిప్పుడే కోలుకొని కుటుంబాలు సంతోషంగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పిడుగులాంటి నిర్ణయం తీసుకుందనే ఆందోళనలో ఉన్నారన్నారు. దీంతో రైతాంగం భవిష్యత్తు అందకారంలోకి నెట్టేయబడుతుందని కాబట్టే ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతుల పక్షాణ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తుందన్నారు.ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లుతెరిచి యాసంగి పంటను కొనాలని సూచించారు. లేని పక్షంలో ఈనెల 11న సీఎం కేసీఆర్ గారి నేత్రుత్వంలో డిల్లీలో దర్నా తీవ్రంగా ఉంటుందన్నారు, ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ టీఆర్ఎస్ అని, నేడు కేసీఆర్ గారి సారథ్యంలో సుశిక్షుతులైన సైనికుల్లా పెద్ద బలం, బలగాన్ని ఉన్న టీఆర్ఎస్ కేంద్రం మెడలు వంచడం తథ్యమన్నారు, పంజాబ్, హర్యానా రైతుల ఉద్యమం కన్నా తీవ్రంగా తెలంగాణ రైతాంగం పోరాటం ఉంటుందన్నారు.తెలంగాణ రైతుల పొట్టమీద కేంద్రం కొడుతుందని, దీన్ని ఉపేక్షించేది లేదన్నారు. 1965 జనవరి 14న ఏర్పడ్డ ఎఫ్.సి.ఐ నాటి నుండి జరుపుతున్న కొనుగోళ్లలో లేని ఇబ్బందులు నేడు ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు.

Also Read : హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

నాటి నుండి యాసంగిలో బాయిల్డ్, వానాకాలంలో రా రైస్ ఎలా కొనుగోల్లు చేస్తున్నారో అలాగే చేయాలన్నారు, మన తెలంగాణలో ఉన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు భారత దేశం కన్నా విభిన్నంగా ఉంటాయని అందువల్ల యాసంగిలో నూక శాతం పెరిగి పోవడంతో రా రైస్ ఇచ్చే పరిస్థితులు లేని విషయాన్ని పరిగణనలోకి తీసుకోని బేషరతుగా యాసంగి ధాన్యంతో పాటు ఏ పంట పండించినా కొనుగోలు చేయాలన్నారు. మేం బిక్ష అడగట్లేదని రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని 7వ షెడ్యూల్ 246 ఆర్టికల్ ప్రకారం పంటల సేకరణ అధికారం, బాధ్యత ఉన్న కేంద్రం సక్రమంగా నిర్వహించాలని అడుగుతున్నామన్నారు. బేషరతుగా రైతులు పండించిన పంటను యదాతథంగా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube