బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్‌

బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్‌

0
TMedia (Telugu News) :

బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్‌

– ఎమ్మెల్సీ కవిత

టీ మీడియా, నవంబర్ 18, జగిత్యాల: బీఆర్ఎస్‌తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలముకుంటాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే ఏమీ చేయలేదని, ఇప్పుడు మరొసారి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ తరఫున ఎమ్మెల్సీ కవిత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెరువులు నిండినా, ఎండిపోయినా చేపలు అక్కడే ఉంటాయి. కప్పలు మాత్రమే చెరువు నుంచి బయటికి వెళ్తాయి. బీఆర్ఎస్ పార్టీ చేపల వంటిది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కప్పల వంటి వాళ్లన్నారు. ఉద్యమ సమయంలో అధికారంలో లేనప్పుడూ కూడా బీఆర్ఎస్ ప్రజలతో ఉందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉందని చెప్పారు.బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజలు గెలుస్తారని, బీజేపీ గెలిస్తే ఎవరికీ లాభం లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ తాగు, సాగు నీరు కూడా ఇవ్వలేదని, కాబట్టి మన గురించి మంచి ఆలోచన చేసే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ నిధులు విడుదల కానివ్వకుండా ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారని విమర్శించారు.టీడీపీ, కాంగ్రెస్ హయాంలో బీడీ కార్మికులను కనీసం గుర్తించలేదని, దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.

Also Read : దక్షిణ గాజాలోని పౌరులు తక్షణమే తరలిపోండి

కటాఫ్ డేట్‌తో సంబంధం లేకుండా ఎన్నికల తర్వాత బీడీ కార్మికులందరికీ రూ.5 వేల పెన్షన్ వస్తుందని తెలిపారు. సౌభాగ్య లక్ష్మీ పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.3 వేల పెన్షన్ ఇవ్వాలని, రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ రక్ష బీమా సౌకర్యం కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపరీతంగా పెంచిన గ్యాస్ సిలిండర్‌ను సబ్సిడీ కింద రూ.400కే అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. రైతు బీమా మొత్తం పెంపు, సన్న బియ్యం పంపిణీ గురించి వివరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube