అభివృద్ధి పథంలో తెలంగాణ.. ఇలాగే కృషి చేస్తే డైమాండ్ ఆఫ్ ఇండియానే
పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం
అభివృద్ధి పథంలో తెలంగాణ.. ఇలాగే కృషి చేస్తే డైమాండ్ ఆఫ్ ఇండియానే
-పది రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం
-కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు
-సీఎం కేసీఆర్
టీ మీడియా, డిసెంబర్ 7, జగిత్యాల : తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఇలాగే కృషిచేస్తే తెలంగాణ డైమాండ్ ఆఫ్ ఇండియాగా ఎదగడం ఖాయమన్నారు. ఇప్పటికే అనేక రంగాల్లోనే దేశంలో నెంబర్1 గా నిలిచామని సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచీగా ఉన్నాయన్నారు. తెలంగాణ మాదిరిగానే కేంద్రం కూడా పనిచేస్తే.. రాష్ట్ర GSDP 14.5 లక్షల కోట్లు ఉండేదని తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా TRS పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు..27 ఎకరాల్లో 510 కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారు. అనంతరం కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిర్మించిన 14వ కలెక్టరేట్ అన్నారు. దేశంలో అత్యధిక జీతాలు అందుకుంటున్నది మన ఉద్యోగులేనని తెలిపారు. గతంలో తెలంగాణలో కారుచీకట్లు ఉండేవి.. కానీ ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నామన్నారు. దేశంలో అనేక రంగాల్లో మనమే నెంబర్1గా ఉన్నామని తెలిపారు. అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2016 రూపాయల వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నామని, రైతుబంధు ఇస్తున్నామని తెలిపారు.
Also Read : వర్ధంతి వేడుకల్లో ఆర్కెస్ట్రా.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం
అయితే, రైతు బంధు అందరికీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారని.. రాష్ట్రంలో 93 శాతం రైతులకు భూమి 5 ఎకరాలలోపే ఉందని తెలిపారు. 25 ఎకరాలకు మించి ఉన్న రైతులు 0.25 మాత్రమే ఉన్నారని.. వివరించారు. గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనే ఒకే రాష్ట్రం తెలంగాణ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. మిషన్‌భగీరథ వెనుక చాలా కష్టం ఉందని.. భగీరథ పైప్‌లు 2లక్షల కిలోమీటర్ల మేర ఉన్నాయని తెలిపారు. చైనా, బ్రెజిల్ తర్వాత అతి ఎక్కువ అడవుల్ని పెంచామంటూ పేర్కొన్నారు. ఇలాగే కృషి చేస్తే డైమండ్ ఆఫ్ ఇండియాగా ఎదగడం ఖాయమంటూ కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణ మాదిరిగా కేంద్రం పనిచేస్తే మన GSDP 14న్నర లక్ష కోట్లు ఉండాలి.. కానీ 3న్నర కోట్లు తెలంగాణ నష్టపోయిందన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube