తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

1
TMedia (Telugu News) :

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల
టి మీడియా,జూన్ 28,హైద‌రాబాద్ :తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని మూడు ప్రభుత్వ వెబ్‌సైట్లలతో పాటు ‘నమస్తే తెలంగాణ’ www.ntnews.com వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.inతోపాటు వీటిలో ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే.. స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మార్క్‌ షీట్‌ను ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.

 

Also Read : జులై 1న టెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

ఫస్టియర్‌లో 63.32 శాతం.. ద్వితీయ సంవత్సరంలో 67.16 శాతం..
ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 62శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరంలో 4,64,892 మంది విద్యార్థులు హాజరవగా.. ఇందులో 2,94,378 మంది పాసవగా.. 63.32శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్‌లో 4,14,380 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 2,68,763 మంది పాసవగా.. 64శాతం ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌లో 50,512 మంది పరీక్షలు రాయగా.. 25,615 మంది ఉత్తీర్ణత సాధించగా.. 54.25శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 72.33శాతం, బాలుర 54.25శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,42,895 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,97,458 మంది ఉత్తీర్ణత సాధించారు. 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 75.33శాతం, బాలురు 59.21 శాతం పాసయ్యారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube