అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ తెలంగాణ

- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

0
TMedia (Telugu News) :

అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ తెలంగాణ

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

టీ మీడియా, నవంబర్ 16, హైదరాబాద్‌ : అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ తెలంగాణ అని సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మోండా మార్కెట్ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కండ్లలా భావించి సీఎం కేసీఆర్‌ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించి మాయమాటలు చెప్పే ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తాం..మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : అడ్డాకుల ప్రచారంలో పాల్గొన్న ఎన్.విజయలక్ష్మి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube