బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు
– నిర్మలా సీతారామన్
టీ మీడియా, నవంబర్ 21, హైదరాబాద్ : ” బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు ” అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్‌లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ … తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని విపక్ష నేతలు సైతం కొనియాడుతున్నారని, రాష్ట్రంలోనూ అభివఅద్ధి జరగాలంటే బిజెపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని ఆరోపించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కఅషి చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు.
Also Read : విరామం లేకుండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్‌ను.. రికాం లేకుండా గెలిపించాలి
”బంగారు తెలంగాణను ఇవాళ అప్పులపాలు చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగా పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. హైదరాబాద్‌లో ఎప్పట్నుంచో ఉన్న పరిశ్రమలు చూపిస్తున్నారు తప్ప ఇతర జిల్లాల్లో అభివఅద్ధి జరగలేదు” అని నిర్మల ఆరోపించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube