తెలంగాణ లో నోటిఫికేషన్ లు వీటికె

టీ మీడియా, మార్చి9,హైదరాబాద్

1
TMedia (Telugu News) :

తెలంగాణ లో నోటిఫికేషన్ లు వీటికె
-నేటి నుండి నియామకాలు
టీ మీడియా, మార్చి9,హైదరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే హోం, విద్య‌, వైద్యారోగ్య శాఖ‌లో భారీగా ఖాళీలు ఉన్నాయి. హోంశాఖ‌లో 18,334, సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌లో 13,086, హాయ్య‌ర్ ఎడ్యుకేష‌న్‌లో 7,878, వైద్యారోగ్య శాఖ‌లో 12,755 ఖాళీల‌కు నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌నున్నాయి.

Also Read :  80,039 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు : సీఎం కేసీఆర్

శాఖల వారీగా ఖాళీల వివరాలు..

హోం శాఖ- 18,334
సెకండరీ ఎడ్యుకేషన్- 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్- 7,878

బీసీల సంక్షేమం- 4,311
రెవెన్యూ శాఖ- 3,560
ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879
నీటిపారుదల శాఖ- 2,692
ఎస్టీ వెల్ఫేర్- 2,399
మైనారిటీస్ వెల్ఫేర్- 1,825

ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ- 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221
ఆర్థిక శాఖ- 1,146

మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్- 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801
రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563
న్యాయశాఖ- 386

పశుపోషణ, మత్స్య విభాగం- 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343
ఇండస్ట్రీస్, కామర్స్- 233
యూత్, టూరిజం, కల్చర్- 184
ప్లానింగ్- 136
ఫుడ్, సివిల్ సప్లయిస్- 106
లెజిస్లేచర్- 25
ఎనర్జీ- 16

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube