టెలికం బోర్డ్ మెంబర్ లుగాబిజెపి శ్రేణుల నియామకం

నియామకపు ఉత్తర్వులు అందించిన ఎంపీ బండి సంజయ్

1
TMedia (Telugu News) :

టెలికం బోర్డ్ మెంబర్ లుగాబిజెపి శ్రేణుల నియామకం.

నియామకపు ఉత్తర్వులు అందించిన ఎంపీ బండి సంజయ్

టి మీడియా, మే 19,కరీంనగర్ :జిల్లాకు చెందిన ఐదుగురు బీజేపీ బాధ్యులు జిల్లా టెలికాం బోర్డు అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమితులయ్యారు. కరీంనగర్ జిల్లా బిజెపి శాఖకు చెందిన జిల్లా మీడియా కన్వీనర్ కటకం లోకేష్ , జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకటరెడ్డి, మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఎండి సమీ పర్వేజ్ , జిల్లా నాయకులు
చేన్నమాధవుని నరసింహ రాజు , మహిళా మోర్చా నాయకురాలు మామిడి చైతన్య లను టెలికాం బోర్డు అడ్వైజరీ సభ్యులుగా నియమించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ జారీచేసిన నియామకపు ఉత్తర్వులను గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ కార్యాలయంలో అందించారు.

Also Read : డివిజన్ లో విస్తృతంగా పర్యటించిన సూడా డైరెక్టర్ ముఖ్తార్ షేక్

ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కుమార్ వారందరినీ సత్కరించి అభినందించారు. జిల్లా టెలికం బోర్డ్ మెంబర్ లు గా తమకు అవకాశం కల్పించిన ఎంపీ బండి సంజయ్ కి ఈ సందర్భంగా వారందరూ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు కరీంనగర్ జిల్లా బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం లో నియామక ఉత్తర్వులు తో రిపోర్టు చేసి , టెలికాం జిఎం ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో బిఎస్ఎన్ఎల్ బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube