టీ మీడియా డిసెంబర్ 7 వనపర్తి : రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యాన్ని మద్దతు ధరతో సహా కొనుగోలు చేయాలని మార్కెట్ యార్డు దగ్గర బుధవారం తెలుగుదేశం పార్టీ, సిపిఎం, సిపిఎం, న్యూడెమోక్రసీ, టీజేఎస్ పార్టీలు రైతులకు మద్దతుగా రాస్తారోకోలు నిర్వహించాయి. ఈ సందర్భంగా టిడిపి నుంచి బి.రాములు ,నందిమల్ల అశోక్, సిపిఎం నుంచి జబ్బార్, ఆంజనేయులు ,న్యూ డెమోక్రసీ నుంచి అరుణ్ కుమార్, రాజన్న, టీజేఎస్ నుంచి ఖాదర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు రోడ్డుపై వేశారని విమర్శించారు. దేశానికి తెలంగాణను రైస్ బోల్ చేస్తానని ప్రగల్బాలు పలికిన కెసిఆర్ తోక ముడిచారని 17 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన మార్కెట్లో మాత్రం 13 శాతం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. వర్షాకాలం పంటలను కొనకుండా యాసంగి గురించి ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాబట్టి ధాన్యానికి మద్దతు ధర కొనుగోలు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సయ్యద్, నందిమల్ల రమేష్ ,దస్తగిరి ,ఆవుల చిన్నయ్య ,నాగయ్య,బాలరాజు, గోవిందు ,సిపిఎం నుండి పరమేశ్వర చారి, రమేష్, లక్ష్మి, న్యూ డెమోక్రసీ నుండి రాజన్న గణేష్ ,రాజు, శివ ,తదితరులు పాల్గొన్నారు.