మొబైల్ కోర్టుని రెగ్యులర్ గా నడిపించాలని స్థానిక శాసన సభ్యులు శ్రీ పొదెం వీరయ్య గారికి తెలుగుదేశం పార్టీ వినతి.
టీ మీడియా భద్రాచలం, అక్టోబర్,23
భద్రాచలం లోని స్పెషల్ అసిస్టెంట్ ఏజెంట్ మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టు మొబైల్ కోర్టు)ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడిపించాలని,మరియు కోర్టు సిబ్బందిని నియమించి,కోర్టుకు బడ్జెట్ కేటాయించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర న్యాయవిభాగం ఉపాధ్యక్షులు మరియు మహబూబాబాద్ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్ ఈరోజు ఉదయం స్థానిక శాసనసభ్యులు శ్రీ పొదెం వీరయ్య గారికి వినతి పత్రం అందచేసారు.న్యాయవాదులు,కక్షిదారులు కోర్టు నడవకపోవడం వలన అనేక ఇబ్బందులకి గురవుతున్నారని మరియు ఏజెన్సీలో సత్వర న్యాయం అందని ద్రాక్షగా మిగిలిపోతుందని,
సత్వరమే కోర్టు నడిచేలా తగిన చర్యలు తీసుకొనేలా సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడాలని కోరగా,సత్వరమే స్పందించిన స్థానిక శాసన సభ్యులు శ్రీ పొదెం వీరయ్య,ఫోన్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ గారితో మాట్లాడి,మొబైల్ కోర్టు సమస్యలని తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అబ్బినేని శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు.