ఆర్జేసి కళాశాలలో ఘనంగా తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు

ఆర్జేసి కళాశాలలో ఘనంగా తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు

1
TMedia (Telugu News) :

ఆర్జేసి కళాశాలలో ఘనంగా తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు

టీ మీడియా,సెప్టెంబర్ 9,ఖమ్మం ; నగరం లోని ట్రంక్ రోడ్ ప్రాంతం లో గల ఆర్జేసి కళాశాలలో శుక్రవారం తెలంగాణ భాష దినోత్సవo సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి జిల్లా ఉపాధి కల్పనా అధికారి శ్రీ రామ్ హాజరై ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆర్జేసి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శివకుమార్ అద్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు.కాళోజీ నారాయణరావు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తపించే వారని,దీనిలో భాగంగా ప్రత్యేక రాష్ట్రo కోసం జరిగిన ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారని తెలిపారు.

 

Also Read : అర్హులైన నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం

 

కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగే నాటికి ఆయన మరణించారని తెలిపారు. ఆయన ను స్మరించు కొనేందుకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వంఆయన జయంతి రోజుని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఇటువంటి మహనీయుల చరిత్ర ను తెలుసుకొని ఆయన స్పూర్తి గా ముందుకు సాగాలని సూచించారు.అనంతరం ఖమ్మం జిల్లా జానపద కళాకారుడు పాగి వెంకన్న జానపద పాటలతో సాగిన ఆటా..పాటాకార్యక్రమం విద్యార్ధులను ఉర్రూతలూగించింది. చివరగా తమ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన శ్రీరామ్,వెంకన్న లను ప్రిన్సిపాల్ శివ కుమార్ ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రవీందర్,నరేష్,కల్పన,సునంద, ఆంజనేయులు,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube