లిక్కర్‌ స్కామ్‌లో ఇద్దరు తెలుగువాళ్ల అరెస్ట్..

-ఈడీ అదుపులో శరత్‌, వినయ్‌బాబు

1
TMedia (Telugu News) :

లిక్కర్‌ స్కామ్‌లో ఇద్దరు తెలుగువాళ్ల అరెస్ట్..

-ఈడీ అదుపులో శరత్‌, వినయ్‌బాబు

టి మీడియా, నవంబరు 10,ఢిల్లీ : ఆరోపించిన ఎక్సైజ్ కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసింది. వీరిలో ఒకరు ఫార్మా కంపెనీ యజమాని అని తెలిపారు. అరెస్టయిన వారు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో వరుసగా తెలుగువాళ్లు అరెస్ట్ అవుతుండడం సంచలనంగా మారింది. తాజాగా అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌ చంద్రారెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు నిందితులను ఈడీ అరెస్ట్ చేయగా, ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో వినయ్ బాబు అనే వ్యక్తిని ఈడీ అరెస్ట్ చేసింది. శరత్‌ చంద్రారెడ్డితో పాటు వినయ్‌బాబు అరెస్ట్ చేశారు.

Also Read : ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

కాసేపట్లో వీళ్లిద్దరినీ రిమాండ్‌కు తరలించనున్నారు. సెప్టెంబర్‌లో శరత్‌చంద్రారెడ్డిని ప్రశ్నించారు. అయితే జాతా ఆయనను ఇవాళ అరెస్టు చేశారు. అసలు ఈ కేసులో ఆయన పాత్రపై ఎలాంటి ఆధారాలు దొరికాయి.. విచారణలో కొత్త విషయాలు ఏం వెలుగులోకి వచ్చాయి. లిక్కర్‌స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ దూకుడుగానే ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే లిక్కర్‌ కేసులో సమీర్ మహేంద్రు, అభిషేక్‌రావు, విజయ్ నాయర్, దినేశ్ అరోరాను అరెస్టు చేశారు. అప్రూవర్‌ దినేశ్ అరోరా స్టేట్‌మెంట్‌తో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం కనిపిస్తోంది. రాబిన్‌ డిస్టిలరీస్‌ అభిషేక్‌రావుతో ప్రముఖులకు లింక్‌లు బయటపడడంతో ఇటీవలే వరుసగా ఆడిటర్లు సహా మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube