మహిళల హక్కులకు చట్టబద్ధత్త కలిపించిన పార్టీ తెలుగుదేశం

టీ మీడియా, మార్చి19, వనపర్తి బ్యూరో :

0
TMedia (Telugu News) :

మహిళల హక్కులకు చట్టబద్ధత్త కలిపించిన పార్టీ తెలుగుదేశం

టీ మీడియా, మార్చి19, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రము 22వ వార్డు నందు ఆదివారం ఇంటిటికీ తెలుగుదేశం కార్యక్రమం ఉత్సహాంగా, జోరుగా సాగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి నందిమల్ల.శారదా అశోక్ పాల్గొని ప్రసంగించారు. శారదా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని ఆస్తిలో సమాన హక్కులు, మహిళా విశ్వవిద్యాలయం,డ్వాక్రా సంఘాలు,దీపం పథకం, రాజకీయ,విద్య,వైద్య,రంగాలలో రిజర్వేషన్లు కలిపించి మహిళలు స్వాలంబన దిశగా అభివృద్ధి చెందేందుకూ కృషి చేసిందని అన్నారు.రాబోవు సాదారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని రావుల. చంద్రశేఖర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని అన్నారు.22వ వార్డ్ ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో నందిమల్ల.అశోక్ అధ్యక్షులు మాట్లాడుతూ నేటివరకు ఇంటిటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు 12వార్డులో పూర్తి చేయడం జరిగిందని ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది అని అన్నారు.మహిళలు వీరతిలకాలు దిద్ది మరోసారి రావుల.చంద్రశేఖర్ రెడ్డి ఎంఎల్ఎ కావాలని కోరుకుంటున్నారని అన్నారు.                                                   

also read :దేశంలోఆపద కాలం నడుస్తోంది

అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నామని అంటూ రావుల హాయంలో జరిగిన అభివృద్ధిని ఇప్పుడు జరుగుతున్న అవినీతి,అరాచక పాలన గూర్చి వివరించి మరోసారి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దస్తగిరి, రవి యాదవ్, ఎం.డి.గౌస్, నందిమల్ల.రమేష్,డి.బాలరాజు,ఖాదర్,ఫారూఖ్,కొత్త.గొల్ల. శంకర్,అనిల్ వార్డ్ ప్రజలు భాగ్యమ్మ,లలిత,పారిజాత,రమాదేవి,సురేఖ,మంగమ్మ, జయమ్మ, పెద్ద..బాలయ్య, చిన్న.బాలయ్య,రాము,మురళి,బషీర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube