కార్మిక సంఘాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 23 వనపర్తి : కార్మిక సంఘాలకు తెలుగుదేశం పార్టీ, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అండగా ఉంటుందని టిడిపి అధ్యక్షుడు నందిమల్ల అశోక్ అన్నారు. తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్మిక సమావేశం మంగళవారం మినీ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. జిల్లా వ్యాప్తంగా డ్రైవర్లు హాజరైనారు ఇట్టి సమావేశానికి టిడిపి అధ్యక్షుడు నందిమల్ల అశోక్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంఘాల ఐక్యత సమస్యల పరిష్కారానికి దారి చూపుతుందని అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో అన్ని కార్మిక సంఘాలకు శాశ్వత భవనాలు నిర్మించిన ఘనత రావుల చంద్రశేఖర్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. టి.ఎమ్. టి.డి.ఎస్ సంగం చేపట్టబోయే కార్యక్రమాలకు రావుల అండదండలు ఉంటాయని అన్నారు. కార్మికుల హక్కుల కోసం వారి సమస్యల కోసం చేసిన కృషిని అభినందించారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు బైరగోని రాజుగౌడ్, ప్రతినిధులు సురేందర్రెడ్డి, మహేష్ ముదిరాజ్, జిల్లా నాయకులు శంకర్, సాదిక్ భాషా, ఖదీర్ భాష తదితరులు పాల్గొన్నారు.

Telugudesam party supports trade unions
TDP president Nandimalla Ashok has said that Telugu Desam Party and former MLA Raula Chandrasekar Reddy.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube