రాయ‌బార కార్యాల‌యాల‌ను తాత్కాలికంగా మూసేసిన శ్రీలంక

రాయ‌బార కార్యాల‌యాల‌ను తాత్కాలికంగా మూసేసిన శ్రీలంక

1
TMedia (Telugu News) :

రాయ‌బార కార్యాల‌యాల‌ను తాత్కాలికంగా మూసేసిన శ్రీలంక
టీ మీడియా,ఏప్రిల్ 6,శ్రీలంక‌ : ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. ఈ నేప‌థ్యంలో శ్రీలంక ప్ర‌భుత్వం ఓ కీల‌క ఇర్ణ‌యం తీసుకుంది. ప‌లు దేశాల్లోని త‌మ రాయ‌బార కార్యాల‌యాల‌ను తాత్కాలికంగా మూసేస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. నార్వే రాజ‌ధాని ఓస్లో, ఇరాక్ రాజ‌ధాని బాగ్దాద్‌లోని రాయబార కార్యాల‌యాల‌ను తాత్కాలికంగా మూసేస్తున్న‌ట్లు పేర్కొంది. వీటితో పాటు సిడ్నీలోని వాణిజ్య రాయ‌బార కార్యాల‌యాన్ని కూడా తాత్కాలికంగా మూసేస్తున్న‌ట్లు శ్రీలంక విదేశాంగ శాఖ‌ ఓ ప్ర‌కట‌న‌లో పేర్కొంది.విదేశీ మార‌క ద్ర‌వ్యం నిల్వ‌లు నిండుకోవ‌డంతో శ్రీ‌లంక దారుణ‌మైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న‌ది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల కొర‌త‌తో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న త‌రుణంలో అధికార కూట‌మిలో విభేదాలు చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. సోమ‌వారం రాత్రి రాజ‌ప‌క్స తాను రాజీనామా చేయ‌బోన‌ని, పార్ల‌మెంట్‌లో 113 మంది స‌భ్యులు గ‌ల పార్టీకి ప్ర‌భుత్వాన్ని అప్ప‌గిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

Also Read : ర‌ష్యా ద‌మ‌న‌కాండ‌లో 165 మంది చిన్నారులు మృతి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube