దేవాలయ నిర్మాణానికి సహకరించండి

దేవాలయ నిర్మాణానికి సహకరించండి

1
TMedia (Telugu News) :

దేవాలయ నిర్మాణానికి సహకరించండి

టీ మీడియా, మార్చి 26, వనపర్తి : మదనపురం మండలంలోని తిరుమలయ్యపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శివరామసాయి నూతన దేవాలయం నిర్మాణానికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ టి.కె.శారద కృష్ణ అన్నారు. అనంతరం సర్పంచ్ తన సొంత డబ్బులు ఒక లక్ష 116 రూపాయలు నగదు శనివారం నూతన దేవాలయ నిర్మాణానికి విరాళంగా కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు సర్పంచ్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరామసాయి మందిరం నిర్మాణం కోసం ప్రజలు, దాతలు పెద్ద సంఖ్యలో డబ్బులు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. గ్రామంలో అద్భుతంగా దేవాలయం నిర్మించడం జరుగుతుందన్నారు. గుడి నిర్మాణం కోసం భక్తులు ప్రజలు నిర్మాణ కమిటీ సభ్యులకు విరాళాలు అందజేయడానికి ముందుకు రావడం పూర్వజన్మ సుకృతం ఫలం అని అన్నారు. దేవుడి ఆశీస్సులతో మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కరు సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు.శివరామసాయి దేవుని ఆశీస్సులతో సంతోషాలతో జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కురుమన్న, తిమ్మన్న, నాగశేషన్న, కాశన్న, పెద్దబాలకృష్ణన్న, శివ, రాములు, సాయిలు, వెంకటేష్, రామ్ కుమార్, రాఘవులు, బాలన్న ,వెంకటన్న,భూపని రాములు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Also Read : ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube