ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

1
TMedia (Telugu News) :

ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
– ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి
టీ మీడియా,మార్చి 20,గుంటూరు:చారిత్రక నేపథ్యం, అనేక విశిష్టతలు ఉన్న నేతి వెంకన్న స్వామి ఆలయాన్ని సమగ్రంగా, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామం లో స్వయంభూగా వెలిసిన నేతి వెంకన్న స్వామి మూడవ శనివారం తిరుణాల వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు అంబటి రాంబాబు తో కలిసి రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణ దేవరాయలు, నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు లు తిరునాళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా అతిథులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో సాదరంగా స్వాగతం పలికారు. అతిధులు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభ్యుడు అంబటి రాంబాబు ఆలయ యొక్క ప్రత్యేకతలను, విశిష్టతలను స్పష్టంగా వై వి సుబ్బారెడ్డి కి వివరించారు. అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మరో పది రోజుల్లో తితిదే నుండి ప్రత్యేక కమిటీని ఇక్కడికి పంపిస్తానని, వారు సమగ్రంగా ఆలయాన్ని పరిశీలించి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తారన్నారు. మొదటిదశలో ఆలయ అభివృద్ధి అనంతరం భక్తులకు అవసరమైన వనరులను, వసతులను ఏర్పాటు చేసి ఈ ఆలయాన్ని జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఆదర్శవంతంగా ఉండేలా అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సహకరిస్తామన్నారు. అన్నప్రసాద విస్తరణను పరిశీలించారు.

Also Read : నందీశ్వరుడికి విశేష పూజలు

ఇటీవల జరిగిన అభివృద్ధి పనులను అంబటి ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అంబటి బ్రహ్మయ్య, మండల కన్వీనర్ ఏపూరి శ్రీనివాసరావు, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, సత్తనపల్లి ఏఎంసీ చైర్మన్ రూరల్ కన్వీనర్ రాయపాటి పురుషోత్తం రావు, బాసు లింగారెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, అచ్యుత శివప్రసాద్,జగదీష్, ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అభివృద్ధి కమిటీ సభ్యులు దాతలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube