దేవాలయం కు విరాళం

దేవాలయం కు విరాళం

1
TMedia (Telugu News) :

దేవాలయం కు విరాళం
టీ మీడియా; ఏప్రిల్ 11,జగిత్యాల :కొడిమ్యాల మండల కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమునకు ఉద్యోగ రీత్యా ముంబై లో స్థిరపడిన గుండేటి సత్యనారాయణ- వసంతలక్ష్మి ల పెద్ద కుమారుడు కోడలు శ్రీ నేష్ – సుస్మిత నడిపి కుమారుడు ,చిన్న కుమారుడు విశాల్ ,సాయి తేజ ల కుటుంబం శాశ్వత చందాదారులుగా 25,555/-(ఇరవైఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు) విరాళంగా అందించారు. అలాగే వీరితో పాటు ఒక అజ్ఞాత భక్తుడు 25000/-(ఇరవై ఐదు వేల రూపాయలు) శాశ్వత చందాదారులుగా విరాళం అందజేశారు.

Also Read : ఘనంగా జ్యోతి రావు పూలే వేడుకలు

విరాళం అందజేసిన కుటుంబ సభ్యులకు అర్చకులు నాగరాజు రమేష్ స్వామి వారి తీర్థప్రసాదాలు అందించి మంగళాశాసనములు తెలపడం జరిగింది. వీరి కుటుంబ సభ్యులకు గ్రామస్థుల తరఫున, ఆలయ నిర్మాణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.అలాగే ఇంకా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు వస్తూ రూపేణ ధన రూపేణ శ్రమ రూపేణ సహకరించగలరని గ్రామ ప్రజలు మరియు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube