రాకపోకలకు ..ఇక తాత్కాలిక బ్రిడ్జి

ప్రతిపక్షాలు, వామ పక్షాలు పార్టీల కృషితో ముందుకు వచ్చిన ప్రభుత్వం

1
TMedia (Telugu News) :

రాకపోకలకు ..ఇక తాత్కాలిక బ్రిడ్జి

– ప్రతిపక్షాలు, వామ పక్షాలు పార్టీల కృషితో ముందుకు వచ్చిన ప్రభుత్వం.
– రూ. 20 లక్షల వ్యయంతో అన్నవరం తాత్కాలిక బ్రిడ్జి .
– ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం, తాత్కాలిక నిర్మాణంతో అసంతృప్తితో ప్రజలు.
– 40 గ్రామాలకు కొంత ఉపశమనం.

టీ మీడియా, జులై 2,వి.అర్.పురం: మండల పరిధిలోని అన్నవరం- ఉమ్మడివరం గ్రామాల మధ్యవున్న బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిన్నది. దీనితో సుమారు నలబై గ్రామాలకు రహదారి మార్గం లేక ఇరువైపులా ఉన్న వాహన దారులు, ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం పై మండల సిపియం పార్టీ నాయకులు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని టెంటు వేసుకొని ధర్నా నిర్వహించారు. అదే క్రమంలో మండల టిడిపి పార్టీ నాయకులు ఎన్నోమార్లు రాస్తోరోకోలు, నిర్వహించారు.

Also Read : బీజేపీ వ్యూహానికి సీఎం కేసీఆర్ ప్రతివ్యూహం

ఈ ప్రాంత ప్రజలు సైతం ప్రభుత్వ పనితీరుపై దుమ్మెత్తి పొయ్యడం తో ఎట్టకేలకు తాత్కాలిక బ్రిడ్జిని కాంక్రీట్ తో నిర్మాణం చేపట్టారు. దీని వలన వర్షాకాలంలో ప్రయాణం సాగిద్దా, సాగదా అనే సందేహం కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గట్టి వరద తాత్కాలిక బ్రిడ్జి పై నుండి వస్తే బ్రిడ్జి ఆగిద్ద లేదా అనే సందేహంలో ప్రజలున్నారు. బ్రిడ్జి ఎంత వరుకు ఈ పాటంతా ప్రజలకు ఉపయోగ పడిద్ధో వేచి చూద్దాం మరి అని స్థానిక ప్రజలు అంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube