పెనుకొండలో ఉద్రిక్తత

పోలీస్ జీపుకు అడ్డం పడుకున్న కార్మికులు

0
TMedia (Telugu News) :

పెనుకొండలో ఉద్రిక్తత
-పోలీస్ జీపుకు అడ్డం పడుకున్న కార్మికులు

టి మీడియా, జనవరి 3, పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నగర పంచాయతీ పారిశుదధ్య కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా కమిషనర్ నగర పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులను పనులలోకి రావాలని కోరడంతో కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేసేవరకు రామన్నారు. ఈ సందర్బంగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో కార్మికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐటీయూ నాయకులు, కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి సీఐ కార్యాలయం కు తరలించారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం,12 మంది మృతి

ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి బాబావలి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్, సిపిఎం నాయకులు తిప్పన్న, నగర పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube