హక్కులు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం

0
TMedia (Telugu News) :

ఉన్న గడువును కుదించడం లో ఆంతర్యం ఏమిటి?

టి మీడియా, నవంబర్ 16, వెంకటాపురం :

ములుగు జిల్లా వెంకటాపురం మండలం తెరాసా ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ హక్కు పత్రాలు ఇవ్వకుండా కుట్ర చేస్తోందని ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ఆరోపించారు. ఒంటిమామిడి, మహితాపురం పోడు రైతులతో ఆదివాసీ నవ నిర్మాణ రైతు సేన అధ్యక్షుడు అట్టం లక్ష్మయ్య అధ్యక్షతన మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏ ఎన్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు మాట్లాడుతూ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం దరఖాస్తుల స్వీకరణ సమయం 3 నెలలు ఉంటుందన్నారు. కానీ ప్రభుత్వం కుట్రపూరితంగా నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వ తేదీ వరకు సమయం ఇచ్చిందని విమర్శించారు. సాగులో ఉన్న హక్కు దారులు అందరికి హక్కు పత్రాలు ఇవ్వాల్సి వస్తుందని దురుద్దేశంతో కేవలం వారం రోజులకు కుదించిందని ఈనెల 17 వ తేదీ చివరి గడువు అని చెప్పడం దుర్మార్గం అన్నారు. నవంబర్ 17 వ తేదీగా ప్రకటిస్తే చాలామంది పోడు సాగు దారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వైపు హక్కు పత్రాలు ఇస్తా అంటూనే, మరో వైపు అడ్డుకునే కుటిల ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

ప్రభుత్వం ధ్వంద వైఖరి ప్రదర్శిస్తోంది అన్నారు. సాగులో ఉన్న ఆదివాసీలు అందరికీ గుంట భూమి కూడా తగ్గకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2005 డిసెంబర్13 కంటే ముందు నుండి సాగులో ఉన్న ఆదివాసీ రైతుల మీద ఇప్పుడు కేసులు పెట్టి కొత్తగా పోడు చేసుకుంటున్నట్టు సృష్టించి సాగు భూములను లాక్కునే కుట్ర చేస్తున్నారని ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. అటవీ హక్కుల కమిటీలదే తుది నిర్ణయం తెలియజేశారు. కొన్ని చోట్ల అటవీ శాఖ అధికారులు అటవీ హక్కుల కమిటీలను బెదిరిస్తున్నారని, అటవీ శాఖ అధికారులు అటవీ హక్కుల కమిటీలను నిర్వీర్యం చేయాలని చూస్తే ఆదివాసీ నవ నిర్మాణ సేన ఉపేక్షించదని హెచ్చరించారు. అటవీ హక్కుల కమిటీలకు రాజ్యాంగ బద్ధమైన చట్ట బద్ధత ఉందన్నారు. అటవీ హక్కుల కమిటీ నిర్ణయాలని అడ్డు చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.ఈ కార్యక్రమంలో శ్యామల గోపి నాద్, కుర్షం రాంబాబు, దబ్బ గణేష్, పోతురాజ్, నారాయణ పోడు రైతులు పాల్గొన్నారు.

Teresa government in Venkatapuram zone of Mulugu district was violating the forest rights act and conspiring not to issue tittle deeds.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube