తెరాస విజయదుంఖ ఖాయం ఎమ్మెల్సీ పళ్ళా రాజేశ్వరరెడ్డి

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వారావుపేట నవంబర్ 26

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థి తాత మధు గెలుపును ఎవరూ అడ్డుకోలేరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే ఆయనను గెలిపిస్తాయి అని రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు గెలుపు కోసం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు సమావేశం స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షత న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పళ్ళా మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.అనంతరం అభ్యర్థి తాత మధు మాట్లాడుతూ పార్టీ లో అతి సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు పిలిచి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన పార్టీ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి,మంత్రి పువ్వాడ కు హృదయ పూర్వక ధన్యవాదాలని ఎమ్మెల్సీ గా నన్ను గెలిపించాలని అహర్నిశలు ప్రజల సంక్షేమ కోసం పాటుపడతానాని పిలిస్తే పలుకుతానని మీ అందరికి అందుబాటులో ఉంటానని అన్నారు.

మాజీ మంత్రి తుమ్మల,ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తాత మధు గెలుపు ఎప్పుడో ఖరారు అయ్యిపోయింది మన నియోజకవర్గ లోనే అత్యధిక మెజార్టీ అందిస్తామని అన్నారు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ లు,ఎంపీటీసీ లు తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Teresa Vijayadunkha Khayam MLC Palla Rajeshwarr Reddy.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube